ప్రియాంక గాంధీ ఆరోపణ
వయనాడ్ (కేరళ) : కేంద్రం పార్లమెంట్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియను కించపరుస్తున్నదని, సరైన చర్చలను అడ్డుకుంటున్నదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా శనివారం ఆరోపించారు. ప్రియాంక గాంధీ వయనాడ్‌లో విలేకరులతో మాట్లాడుతూ, ఏవిధంగానైనా చర్చలను నివారించడమే కేంద్ర ప్రభుత్వ దృక్పథం అని, అందుకు అది వివిధ వ్యూహాలు అనుసరిస్తోందని విమర్శించారు. ‘గత కొన్ని పార్లమెంట్ సెషన్లలో నేను గమనించిన వారి విధానం ఏమిటంటే ప్రతిపక్ష నిరసన వ్యక్తం చేయబోతున్నదని వారు భావించిన ఏదైనా అంశాన్ని రేకెత్తించడం ద్వారా, ప్రతిపక్ష నాయకుడని మాట్లాడినివ్వకపోవడం ద్వారా ఏవిధంగానైనా చర్చలను నిరోధించడం’ అని ఆమె ఆరోపించారు.
పార్లమెంట్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియ సమర్థంగా పని చేయకుండా కేంద్రర అడ్డుకుంటున్నదని కూడా ప్రియాంక ఆరోపించారు. ఎంపిలు అటువంటిదిచూడవలసి రావడం ‘అత్యంత శోచనీయం’ అని ఆమె వ్యాఖ్యానించారు. ‘పార్లమెంట్‌లో చర్చలకు విఘాతం కలిగిస్తున్నాయని ప్రతిపక్షాలను తరచు నిందిస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం కింద వారు ఆ ప్రక్రియకు అవరోధాలు సృష్టిస్తుండడం మేము చూశాం. బహుశా ఇటువంటిది మొదటిసారిగా ప్రతి ఒక్కరి దృష్టికి వస్తున్నట్లుంది’ అని ప్రియాంక అన్నారు. వయనాడ్ కల్పెట్టలో కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి సమన్వయ, పర్యవేక్షక కమిటీ (దిశ) సమావేశానికి ప్రియాంక శనివారం ఉదయం హాజరయ్యారు.