Thursday, December 26, 2024

2024 బడ్జెట్‌ను ప్రశంసించిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

‘సమాజంలోని ప్రతి వర్గాన్ని బలోపేతం చేస్తుంది’ అన్నారు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ, నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్-2024ను ప్రశంసించారు. ‘ఈ బడ్జెట్ సమాజంలోని ప్రతి వర్గాన్ని బలోపేతం చేస్తుంది. ఈ బడ్జెట్ దేశంలోని పేదలు, గ్రామాలు, రైతులను సౌభాగ్యం దిశలో నడిపించనున్నది’’ అని ఆయన వీడియో సందేశం ద్వారా తెలిపారు.

‘‘గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు .   ఈ బడ్జెట్ కొత్త మధ్యతరగతి సాధికారత కోసం. ఈ బడ్జెట్ ద్వారా యువతకు అపరిమిత అవకాశాలు లభిస్తాయి. ఈ బడ్జెట్ నుండి విద్య , నైపుణ్యం కొత్త స్థాయిని పొందుతాయి. ఈ బడ్జెట్ కొత్త మధ్యతరగతికి శక్తిని ఇస్తుంది.. ఈ బడ్జెట్ మహిళలు, చిన్న వ్యాపారులు, MSME లకు సహాయం చేస్తుంది, ”అని మోడీ అన్నారు.

విద్య , నైపుణ్యానికి బడ్జెట్ కొత్త పీఠం వేస్తుందని ప్రధాని అన్నారు. “ఇది మధ్యతరగతి  ప్రజలకు కొత్త బలాన్ని ఇస్తుంది. గిరిజనులు, దళితులు , వెనుకబడిన వారిని బలోపేతం చేసే లక్ష్యంతో ఇది బలమైన పథకాలతో వచ్చింది. ఆర్థిక భాగస్వామ్యానికి భరోసా కల్పించేందుకు ఈ బడ్జెట్ తోడ్పడుతుంది’’ అని ప్రధాని మోడీ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News