Friday, November 22, 2024

నోర్డిక్ దేశాల ప్రధానులతో మోడీ వరస భేటీలు

- Advertisement -
- Advertisement -

Modi holds series of meetings with Nordic heads of state

నార్వే, స్వీడన్, ఐస్‌ల్యాండ్, ఫిన్లాండ్ ప్రధానమంత్రులతో ద్వైపాక్షిక చర్చలు

కోపెన్‌హాగన్: యూరప్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం నార్వే, స్వీడన్ ఐస్‌ల్యాండ్, ఫిన్లాండ్ దేశాల ప్రధానమంత్రులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ ఉత్తర ఐరోపా, ఉత్తర అట్లాంటిక్ దేశాలను నోర్డిక్ దేశాలుగా పిలుస్తారు. డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లో భారత్ నోర్డిక్ దేశాల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని మోడీ ఈ దేశాల ప్రధానులతో సమావేశమయ్యారు. మూడు ఐరోపా దేశాల పర్యటన చివరి దశలో భాగంగా మంగళవారం బెర్లిన్‌నుంచి కోపెన్‌హాగన్ చేరుకున్న ప్రధాని మోడీ తొలుత నార్వే ప్రధాని జొనాస్ గహర్ స్టోర్‌తో సమావేశం అయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలపైనా పూర్తి స్థాయి చర్చలు జరిపారు. నార్వే ప్రధానితో నిర్మాణాత్మక చర్చలు జరిపానని, స్వచ్ఛ ఇంధనం, రోదసి, ఆరోగ్యం తదితర రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకునే విషయమై తాము చర్చలు జరిపినట్లు మోడీ ఒక ట్వీట్‌లో తెలిపారు.

ఇరువురు నేతలు సమావేశం కావడం ఇదే మొదటి సారి. స్వీడన్ ప్రధాని మగ్దలీనా ఆండర్సన్, ఐస్‌ల్యాండ్ ప్రధాని క్యాతరిన్ జాకోబ్స్‌డోటిర్, ఫిన్లాండ్ ప్రధానమంత్రి సన్నా మారిన్‌తోను ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే అంశంపై ఈ నేతలతో ప్రధాని చర్చించినట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపైనా ఈ నేతలతో ప్రధాని చర్చించారు. భారతీయ కంపెనీలతో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగాఫిన్లాండ్ కంపెనీలను ప్రధాని ఆహ్వానించారు. వివిధ రంగాలు ముఖ్యంగా టెలికాం మౌలిక సదుపాయాలు, డిజిటల్ ట్రాన్స్‌ఫరేషన్ రంగాల్లో భారతీయ మార్కెట్లు అందిస్తున్న అపారమైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఫిన్లాండ్ కంపెనీలను కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News