Wednesday, January 22, 2025

ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన మోడీ

- Advertisement -
- Advertisement -

ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. వారణాసిలో నిర్మించిన వరల్డ్ బిగ్గెస్ట్ ధ్యాన కేంద్రమైన ‘స్వర్ వేద్ మహామందిర్’ను సోమవారం ప్రధాని ప్రారంభించి.. మందిరంలో కలియతిరుగుతూ పరిశీలించారు. ఈ సందర్భంగా మందిరం నిర్వాహకులు స్వతంత్ర దేవ్ మహరాజ్, విజ్ఞానంద్ దేవ్ మహరాజ్ లు.. దీనికి సంబంధించిన విశేషాలను ప్రధాని మోడీకి వివరించారు.

ఒకేసారి 20 వేల మంది ధ్యానం చేసుకునే విధంగా ఈ ధ్యాన మందిరాన్ని ఏడు అంతస్తుల్లో నిర్మించారు. రామాయణ, మహాభారత కావ్యాలను ప్రతిబింబించే కళాకృతులు ఈ మహా మందిరంలో అడుగడుగునా దర్శనమిస్తాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News