Thursday, September 19, 2024

మిగులు ఆహారం ఉన్న దేశంగా ఇండియా: పిఎం మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ఇండియా మిగులు ఆహారం ఉన్న దేశమని, ప్రపంచ ఆహార భద్రత, ప్రపంచ పోషకాహార భద్రత కోసం కృషి చేస్తున్న దేశం అని అన్నారు. ఢిల్లీలో వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ అంతర్జాతీయ సదస్సు(ICAE)ను ఆయన నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశం రసాయన రహిత సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందన్నారు.

వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి, రైతుల జీవితాలను బాగుపరచడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. చిరుధాన్యాలు, పాలు, పప్పులు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో భారత్ అగ్రదేశంగా ఉందన్నారు. దేశం వ్యవసాయ రంగంలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగిస్తుందన్నారు.  కిసాన్ సమ్మాన్ కింద ఒక్క క్లిక్ తో పది కోట్ల రైతుల ఖాతాలోకి నిధులు జమా అవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News