Tuesday, January 21, 2025

మోడీ నిజమైన కర్మయోగి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తనకు అత్యంత ప్రీతిపాత్రమైన తల్లి హీరాబెన్ అంత్యక్రియుల ముగిసిన కొద్ది సేపటికే ప్రధాని నరేంద్ర మోడీ విధుల్లో మునిగి పోయారు. తల్లి మరణంతో పశ్చిమ బెంగాల్ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు ప్రాజెక్టులను ప్రారంభించి సహచర మంత్రులకు ఆదర్శంగా నిలిచారు. వారంతా ప్రధానిని కర్మయోగిగా అభివర్ణిస్తూ వ్యక్తిగత బాధకన్నా దేశం ముఖ్యమన్న సందేశాన్ని ఇచ్చారంటూ పొగడ్తలతో ముంచెత్తారు. కేరళలోని ఒక కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇదే విషయాన్ని తెలియజేస్తూ, తమ అధికార కార్యక్రమాలును రద్ద్దు చేసుకోవద్దని, వాటిని పూర్తి చేసిన తర్వాతే ఢిల్లీకి రావాలని తన మంత్రివర్గ సహచరులందరికీ ప్రధాని చెప్పారని తెలిపారు.

ఆయన సూచన మేరకు హోంమంత్రి అమిత్ షా కూడా కర్నాటకలో తన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తల్లి అంత్యక్రియలు పూర్తయిన కొద్ది గంటలకే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని మోడీ నిజమైన కర్మయోగి అని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అంటూ, తమలాంటి లక్షలాది మంది పార్టీ కార్యకర్తలకు ఆయన స్ఫూర్తిగా నిలిచారన్నారు. పలువురు బిజెపి నేతలు సైతం బెంగాల్‌లో జరిగిన అధికారిక కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్న చిత్రాలను ట్విట్టర్‌లో పంచుకుంటూ వ్యక్తిగత బాధను సైతం దిగమింగుకుని కర్తవ్యానికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రధానిపై ప్రశంసలు వర్షం కురిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News