Wednesday, January 22, 2025

మోడీ శక్తివంతుడు: శశి థరూర్

- Advertisement -
- Advertisement -

మోడీ శక్తివంతుడు రాజకీయ శక్తి
కొనియాడిన కాంగ్రెస్ నేత థరూర్
సామాజిక విషం చిమ్మిన దిట్ట
యుపిలో విస్మయకర ఫలితమే
ఓటరుకు ఏదైనా చేయగల సత్తా
ప్రియాంక ప్రచారం విలక్షణం
కాంగ్రెస్ ముందు పలు చిక్కులు

Modi is more energetic person

జైపూర్ : ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ గణనీయంగా కొనియాడారు. ప్రధాని మోడీ బ్రహ్మండమైన శక్తి, దక్షిత ఉందని వ్యాఖ్యానించారు. ఇటీవలి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి విజయానికి ఆయన నాయకత్వ సారథ్యమే కారణం అని స్పష్టం చేశారు. ఓ వైపు కాంగ్రెస్ పరాజయంపై విశ్లేషణలు, అధినాయకత్వ వ్యవహారంపై చర్చలు సాగుతున్న దశలోనే ఈ సీనియర్ నేత వ్యాఖ్యలు వెలువడ్డాయి. ప్రధాని మోడీ శక్తివంతుడు అనే ప్రశ్నలతో సోమవారం థరూర్ ముంచెత్తడం కీలకం అయింది. మోడీ కొన్ని చాలా ప్రభావిత పనులు నిర్వర్తించారు. ప్రత్యేకించి రాజకీయంగా తన చర్యలతో పేరు గడించారని అన్నారు. పార్లమెంట్‌బడ్జెట్ సెషన్ పున:ప్రారంభం దశలోనే విపక్షం నుంచి ప్రధానికి ఈ విధంగా ప్రశంసలు దక్కడం విశేష పరిణామం అయింది.

ఎన్నికలలో ఆయన ఇంతటి విజయం సాధిస్తారని తాము అనుకోలేదని, అయితే ఇది ఆయన సాధించారని అన్నారు. జైపూర్‌లో సాహితీ ఉత్సవానికి వచ్చిన సందర్భంగా ఈ ఫజిల్ పదాల మాంత్రికుడు విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. యుపి ఓటర్లు బిజెపిని విస్మయ పరుస్తారని తానుభావించానని అయితే వారు ఇప్పుడు బిజెపి కోరుకున్నదే అందించారని, విజయం ధారాదత్తం చేశారనిఅన్నారు. ప్రధానిని ఓ వైపు ప్రశంసలతో ముంచెత్తుతూనే థరూర్ మరో వైపు ఆయనపై నిశిత విమర్శలకు దిగారు. అత్యంత ప్రమాదకరమైన సామాజిక శక్తులకు ఆయన ఊతం ఇచ్చారని, మతపరమైన చిచ్చుకు రంగం సిద్ధం చేశారని, దీనితో విషపూరిత వాతావరణం నెలకొందని, ఇది దురదృష్టకరం అన్నారు. యుపి ఎన్నికల ఫలితాలు ఊహించినవే అని రాజకీయ విశ్లేషకులు చెప్పడం పట్ల థరూర్ విస్మయం వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ వచ్చే వరకూ అతి కొద్ది మందే బిజెపి విజయం సాధిస్తుందని తెలిపారని గుర్తుచేశారు.

యుపిలో బిజెపికి విస్మయకర పరిణామాలను తాను ఊహించానని అన్నారు. అక్కడ చాలా తీవ్రస్థాయి పోటీ ఉంటుందని తాను ఇతరులు కొందరు భావించారని, కొందరైతే ఈసారి సమాజ్‌వాది పార్టీ అధికారంలోకి వస్తుందని విశ్లేషించారని, అయితే ఇటువంటి అంచనాలు అన్నీ తలకిందులు అయ్యాయని చెప్పారు. భారతీయ ఓటర్లను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు, వారు ఏదైనా తీర్పు చెప్పగలరు. తిమ్మిని బమ్మి చేసే సత్తా వారికి ఉంది. ఈ కోణంలో చూస్తే బిజెపిని కూడా ఏదో ఒక్కరోజు వారు విస్తుపొయ్యేలా చేయకుండా ఉండరు. అయితే ఇప్పుడు బిజెపి కోరుకున్నది వారు అందించారని తెలిపారు. యుపి విషయానికి వస్తే అక్కడ బిజెపి ఇంత మెజార్టీతో గెలుస్తుందని ఎక్కువగా ఎవరూ ఊహించలేదు. ఎస్‌పి గట్టి పోటీ ఇస్తుందని , అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదని అనుకున్నారు. అయితే బిజెపి వచ్చింది. కానీ ఎస్‌పి ఇంతకు ముందటి కన్నా ఎక్కువ స్థానాలతో ప్రతిపక్షంగా బలోపేతం అయిందని తెలిపారు.కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ ప్రచారం గణనీయంగా సాగింది. దీనిని ఎవరూ తప్పు పట్టడానికి వీల్లేదు. తాను కూడా ఇదే భావనతో ఉన్నానని, ఆమె ప్రచార శైలి ప్రజలను ప్రభావితం చేయలేదనే వాదన సరికాదని స్పష్టం చేశారు. పార్టీ ముందు పలు కీలక అంశాలు ఉన్నాయి. పలు రాష్ట్రాలలో పార్టీ ఉనికి దెబ్బతింటోంది. గత 30 ఏళ్లలో దశలవారిగా పార్టీ క్షీణత గమనిస్తూ వస్తున్నామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News