Saturday, November 23, 2024

జనాదరణలో మేటి మోడీ

- Advertisement -
- Advertisement -

గ్లోబల్ రేటింగ్స్‌లో ప్రధాని నరేంద్ర మోడీ నంబర్ 1
రేటింగ్స్‌లో వెనుకబడిన, బైడెన్, ట్రూడో, సునాక్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి మరో అత్యున్నత గౌరవం దక్కింది. అ త్యధిక జనాదరణ కలిగిన ప్రపంచ నాయకుడిగా నరేంద్ర మోడీ ఆవిర్భవించారు. అమెరికాకు చెందిన గ్లోబల్ డెసిషన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మా ర్నింగ్ కన్సల్ట్ జరిపిన సర్వేలో 78 శాతం రేటింగ్స్‌తో ప్రపంచంలోనే అత్యధిక జనాదరణ కలిగిన నాయకుడిగా మొదటి స్థానంలో మోడీ నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జుస్టిన్ ట్రూడో, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌లను తోసిరాజని అత్యధిక జనాదరణ గల ప్రపంచ నేతగా నరేంద్ర మోడీ అవతరించారు. ఈ ఏడాది జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ మధ్యన జరిపిన సర్వే ద్వారా ఈ రేటింగ్స్ లభించినట్లు ఏజెన్సీ తన వెబ్‌సైట్‌లో తెలిపింది.

ఒక్కో దేశంలో ఆ వారంలో లభించిన వ్యూస్ ఆధారంగా ఈ రేటింగ్స్ నిర్ణయించారు. సర్వేలో ప్రధాని మోడీకి 75 శాతం అప్రూవల్ రేటింగ్స్ రాగా మెక్సికన్ అధ్యక్షుడు ఆండ్య్రూ మాన్యువల్ లోపెజ్ ఒబ్రడార్ 65 శాతం రేటింగ్స్‌తో ద్వితీయ స్థానంలో నిలిచారు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ 63 శాతం రేటింగ్స్‌తో మూడవ స్థానంలో నిలిచారు. తగ ఏడాది డిసెంబర్‌లో ఇదే సంస్థ జరిపిన సర్వేలో ప్రధాని నరేంద్ర మోడీ 76 శాతం రేటింగ్స్‌తో అత్యధిక జనాదరణ గల నేతగా నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 37 శాతం రేటింగ్స్‌తో 11వ స్థానంలో నిలువగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో 29 శాతం రేటింగ్స్‌తో 17వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ 25 శాతం రేటింగ్స్‌తో 20వ స్థానంలో నిలిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News