Sunday, December 22, 2024

సికింద్రాబాద్ ప్రమాదంపై మోడీ, కెటిఆర్ దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో ఎనిమిది మృతి చెందిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ మంత్రి కెటిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాతో పాటు క్షతగాత్రులకు రూ.50 వేల రూపాయలు అందిస్తామని కేంద్రం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు మోడీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున మూడు లక్షల రూపాయల పరిహారం అందిస్తామని కెటిఆర్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు కూతవేటు దూరంలో రూబీ లాడ్జి సెల్లార్‌లో ఎలక్ట్రిక్ షోరూలో బ్యాటరీలు పేలడంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. మరో పది మంది గాయపడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News