Wednesday, December 25, 2024

వారణాసిలో మోదీ, రెండు చోట్లా రాహుల్ ముందంజ..

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ : దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. దేశంలో బీజేపీ హవా మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది. వారణాసిలో ప్రధాని మోదీ హాట్రిక్ దిశగా దూసుకెళ్తున్నారు. ఈ తరుణంలో ఇండి కూటమి స్వల్పగా వెనుకబడి ఉంది. అయితే రాయబరేలీ, వాయనాడ్‎లో రాహుల్ కు స్పష్టమైన మెజార్టీ కనిపిస్తోంది. ఇద్దరు కీలక నేతల మధ్య హోరా హోరీగా పోరు సాగుతోంది. ఇప్పటి వరకు 54 సీట్లకు ట్రెండ్స్ వచ్చాయి. ఎన్డీయే 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇండి కూటమి 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరుల ఖాతాలో 1 సీటు ఉంది.

నాగ్‌పూర్ నుంచి నితిన్ గడ్కరీ ముందంజలో ఉన్నారు. రాయ్‌బరేలీ, వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ ఆధిక్యంలో ఉన్నారు. మెయిన్‌పురి నుంచి డింపుల్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. భిల్వారా నుంచి సీపీ జోషి ఆధిక్యంలో ఉన్నారు. మండిలో కంగనా రనౌత్ లీడ్ లో కొనసాగుతున్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. విదిశ నుంచి బీజేపీ అభ్యర్థి, మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ముందంజలో ఉన్నారు. భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్థి అలోక్ శర్మ ఆధిక్యంలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News