Wednesday, January 22, 2025

మోడీ ఎల్‌ఐసిని నాశనం పట్టించాడు: ఓవైసీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసి) ‘పెట్టుబడి విలువ’(వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్) ఆర్టికల్ గురించి ప్రస్తావిస్తూ మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. ఎల్‌ఐసిలో సామాన్యులు పెట్టుకున్న పొదుపు డబ్బును ప్రధాని నరేంద్ర మోడీ తీసుకెళ్లి అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టి రిస్క్‌లో పడేశారన్నారు. ‘పూరా కుప్పా కర్ దియా(నాశనం పట్టించాడు), తన ఒక్క మిత్రుడి కోసం సామాన్యుల పొదుపు డబ్బును రిస్క్‌లో పడేశాడు ప్రధాని’ అన్నారు. ‘భారత ప్రధాని లక్షం ప్రజల కన్నా లాభం ప్రధానం’లా ఉందని ఆయన ట్వీట్ చేశారు. ఓవైసీ సిఎన్‌బిసిటివి డాట్ కామ్‌తో షేర్ చేసుకున్న ఆర్టికల్ ప్రకారం ‘అదానీ గ్రూప్ కంపెనీలో ఎల్‌ఐసి పెట్టిన విలువైన పెట్టుబడి (వాల్యూ ఇన్వెస్ట్‌మెంట్స్) కాస్తా నెగటివ్‌గా మారాయి’ అన్నారు.

అదానీ గ్రూప్ కంపెనీల్లో ఫిబ్రవరి 22 నాటికి ఎల్‌ఐసి పెట్టుబడి విలువ రూ. 33632 కోట్లు. ఎక్స్‌ఛేంజ్‌ల వద్ద డిసెంబర్ వరకున్న షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ప్రకారం ఇది తెలిసింది. ఇక జనవరి 27 న అదానీ గ్రూప్‌లో రూ. 56142 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్లు ఎల్‌ఐసి వెల్లడించింది. గత కొన్ని వారాలుగా అదానీ గ్రూప్ స్టాకులు హెడ్‌లైన్స్‌లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హిండెన్‌బర్గ్ నివేదిక విడుదలయ్యాక గౌతమీ అదానీ నికర ఆస్తి విలువ తగ్గిందని వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో 27వ స్థానానికి దిగజారారు. అంటే నేటి వరకు (ఇయర్ టు డేట్) ఆయన నికర సంపద 62 శాతం కుంచించుకుపోయింది. ప్రస్తుతం ఆయన సంపద విలువ 46.1 బిలియన్ డాలర్లు. కానీ 2023 జనవరి 1న అదే 121 బిలియన్ డాలర్లు ఉండింది. ఆయన నికర సంపద భారీగా కుంచించుకుపోయింది. దాంతో ఆయన సంపద రెండేళ్ల కనిష్ఠానికి పడిపోయింది(44.9 బిలియన్ డాలర్లకు).

Modi and Adani

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News