Monday, December 23, 2024

మోడీతో బ్యాడ్మింటన్ బృందం భేటీ

- Advertisement -
- Advertisement -

థామస్ కప్ సాధించి భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించిన బ్యాడ్మింటన్ బృందం ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయింది. ఆటగాళ్లతో పాటుగా ప్రధాన కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా ఉన్నారు.ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆటగాళ్లతో కొద్ది సేపు ఆప్యాయంగా ముచ్చటించారు. అలాగే క్రీడాకారులు ఆ మెగా ఈవెంట్‌లో తమకు ఎదురైన అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు.ఈ విషయాన్ని కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్‌లో ఫోటోలతో పంచుకున్నారు. అలాగే ఉబెర్ కప్‌లో పాల్గొన్న భారత మహిళా క్రీడాకారిణుల కూడా ప్రధానిని కలిశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News