Monday, December 23, 2024

కన్నడ నటులు యష్, రిషబ్ షెట్టిలతో పిఎం మోడీ భేటీ!

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులోని రాజ్‌భవన్‌లో ఆదివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ కన్నడ నటులు యష్, రిషబ్ శెట్టిలతో భేటీ అయ్యారు. యల్హంకలో ఎయిర్ స్టేషన్‌ను ప్రారంభించేందుకు ప్రధాని మోడీ బెంగళూరుకు వెళ్లారు. పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్విని రాజ్‌కుమార్ కూడా ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. వారంతా సినిమాలు, కర్నాటక సంస్కృతి తదితర అంశాల గురించి ముచ్చటించుకున్నట్లు సమాచారం. దక్షిణాది సినిమాలు సాధిస్తున్న ఘనతను కూడా ప్రధాని మోడీ ఈ సందర్భంగా కొనియాడారు. కర్నాటక బిజెపి ట్విట్టర్ ద్వారా దీని గురించి పోస్ట్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News