Wednesday, January 22, 2025

మోడీకి ‘నో ఎంట్రీ’

- Advertisement -
- Advertisement -
హైదరాబాద్‌లో పలుచోట్ల వెలిసిన ఫ్లెక్సీలు

హైదరాబాద్ : రాష్ట్రానికి రానున్న ప్రధాని మోడీ రాకను నిరసిస్తూ నగరంలోని పలుచోట్ల ప్రధానికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. నో ఎంట్రీ టు తెలంగాణ అంటూ నగరంలోని జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్ , పంజాగుట్ట తదితర ప్రాంతాలలో చేనేత యూత్ ఫోర్స్ పేరిట ఫ్లెక్సీలు వెలిశాయి. దేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన చేనేత రంగాన్ని కుదేలు చేసే విధంగా ఆ రంగంపై ఐదు శాతం జిఎస్‌టిని విధించడంతో పాటు దేశవ్యాప్తంగా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న మోడీ రాకను ఇప్పటికే పలు ప్రజాసంఘాలు విద్యార్థి యువజన సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.

వారి వాదన సమర్థించే విధంగా చేనేత యూత్ ఫోర్స్ సైతం మోడీజీ.. మా రాష్ట్రానికి రాకండి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం చర్చనీయాంశంగా మారింది. చేనేత వర్గాలు కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఏ స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నాయో ఈ ఫ్లెక్సీలే నిదర్శనం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వ్యవసాయ రంగం తరువాత అత్యధికులకు ఉపాధి కల్పిస్తున్న రంగాన్ని మోడీ నిర్లక్ష్యం చేయడంతో గతంలో లాగానే ఈ ఎనిమిదేళ్లలో సైతం చేనేతపై ఆధారపడ్డ ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారని ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకుడు అలిశెట్టి అరవింద్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News