Sunday, February 23, 2025

షర్మిలకు మోడీ ఫోన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైఎస్సార్టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. ఇటీవల హైదరాబాద్ లో ఆమె అరెస్ట్ వ్యవహారంపై అరా తీశారు. షర్మిలకు జరిగిన ఘటనపై ప్రధాని సానుభూతి తెలిపారు. ప్రధాని దాదాపు పది నిమిషాల పాటు ఆమెతో మాట్లాడారు.

వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రగతి భవన్ ముట్టడి యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించిన వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు షర్మిలను మరోసారి హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం విధితమే. ఆమె కారులో కూర్చొని కిందికు దిగేందుకు నిరాకరించడంతో కారుతో సహా క్రేన్ సాయంతో లిఫ్ట్ చేసి తీసుకెళ్లి పోయారు. వరంగల్ జిల్లాలో నర్సంపేట నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో ఆమెను హైదరాబాద్ కు తరలించారు. పాదయాత్రలో పాల్గొన్న ప్రచారరథానికి నిప్పు పెట్టడంతో పాటు పలు వాహనాలను ధ్వంసం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News