Sunday, January 19, 2025

ఆ ఐదు రాష్ట్రాలలో వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై మళ్లీ మోడీ ఫోటో!

- Advertisement -
- Advertisement -

Modi photo again on vaccine certificates in those five states!

 

న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్‌తోసహా ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఈ ఐదు రాష్ట్రాలలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ముద్రణను తిరిగి ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు తర్వాత జనవరి 8 నుంచి ఉత్తర్ ప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాలలో కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోడీ ఫోటోను ప్రభుత్వం తొలగించింది. ఈ ఐదు రాష్ట్రాలలో తిరిగి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై మోడీ ఫోటోను ముద్రించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్‌సుఖ్ మాండవీయ యోచిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కోవిన్ పోర్టల్‌లో అవసరమైన మార్పులు చేసి ఈ ఐదు రాష్ట్రాలలో వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోడీ ఫోటోలు తిరిగి ముద్రించేలా వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News