Friday, November 22, 2024

వెంకయ్యనాయుడు సేవలను దేశం ఎప్పటికీ మరవదు: మోడీ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడితో సుదీర్ఘకాలం పని చేసే అవకాశం తనకు దక్కిందని, గ్రామ స్థాయి నుంచి ఉన్నత స్థానానికి ఆయన ఎదిగారని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. మహానేత వెంకయ్యనాయుడు పుట్టిన రోజు సందర్భంగా ఆయన జీవితం, ప్రయాణం పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. ఈ సందర్భంగా మోడీ ప్రసంగించారు.  ఆయన జీవితంపై పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయని కొనియాడారు. ఈ పుస్తకాలే దేశ ప్రజల సేవకు మార్గనిర్దేశనం చేస్తాయని, వేలాది కార్యకర్తలు వెంకయ్య నుంచి ఎంతో నేర్చుకున్నారని, ఎమర్జెన్సీ సమయంలో వెంకయ్య పోరాటం చేయడంతో పాటు 17 నెలలు జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు.

గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖలో తనదైన ముద్ర వేశారని, స్వచ్ఛభారత్, అమృత్ యోజన వంటి ఎన్నో పథకాలు సమర్థంగా అమలు చేశారని, వెంకయ్య చాతుర్యం, వాగ్దాటి ముందు ఎవరూ నిలువలేరన్నారు. రాజ్య సభ చైర్మన్ గా సభను సజావుగా నడిపారని, ఆయన సేవలను దేశం ఎప్పటికీ మరవదని, ఆర్టికల్ 370 రద్దు బిల్లు తొలుత రాజ్యసభ ముందుకు వచ్చిందని, ఈ బిల్లు విషయంలో వెంకయ్య కీలక పాత్ర పోషించారని మోడీ కొనియాడారు. రాజ్య సభ నిర్వహణలో వెంకయ్య అనుభవం చాలా ఉపయోగపడిందని, దీర్ఘకాలం వెంకయ్య ఆరోగ్యంగా ఉండి మార్గనిర్దేశం చేయాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News