Monday, January 20, 2025

రేఖా పాత్ర..మీరు శక్తి స్వరూపిణి!

- Advertisement -
- Advertisement -

బసీర్‌హాట్ అభ్యర్థినికి మోడీ ప్రశంసలు

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలు ఎదుర్కొంటున్న అకృత్యాలపై గళమెత్తి బసీర్‌హాట్ నుంచి బిజెపి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేఖా పాత్రను శక్తి స్వరూపిణిగా ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. సందేశ్‌ఖాలీలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, స్థానిక టిఎంసి నాయకుడు షాజహాన్ షేక్, అతని అనుచరులు సాగిస్తున్న అకృత్యాలకు వ్యతిరేకంగా గళమెత్తిన రేఖా పాత్రను బిజెపి బసీర్‌హాట్ నియోజకవర్గానికి అభ్యర్థిగా బిజెపి ఎంపిక చేసింది. సందేశ్‌ఖాలీ గ్రామం ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. మంగళవారం ఆమెతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ ఎన్కికల ఏర్పాట్లు, ఓటర్ల నుంచి బిజెపికి వస్తున్న మద్దతు గురించి అడిగితెలుసుకున్నారని బిజెపి నాయకులు తెలిపారు. రేఱా పాత్రను శక్తి స్వరూపిణిగా ప్రధాని మోడీ అభివర్ణిస్తూ ఆమె టిఎంసి నేతల దురాగతాలకు వ్యతిరేకంగా సాగించిన పోరాటాన్ని ప్రశంసించారు. పశ్చిమ బెంగాల్‌లోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటైన బసీర్‌హాట్‌కు ప్రస్తుతం టిఎంసి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇడి అధికారులపై దాడికి సంబంధించి అరెస్టయిన షాజహాన్ షేక్, అతని అనుచరులు కొందరు ప్రస్తుతం సిబిఐ కస్టడీలో ఉన్నారు. షేక్‌ను టిఎంసి పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News