Monday, January 20, 2025

మాధవీలతపై మోడీ ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నగరంలో బిజెపి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న మాధవీలతపై ప్రధాని మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె ఇటీవల ఓ జాతీయ మీడియా నిర్వహించిన చర్చలో పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై మోడీ ప్రతిస్పందిస్తూ ‘మాధవీలతాజీ, మీ ‘ఆప్ కీ అదాలత్’ ఎపిసోడ్ అద్భుతంగా ఉంది. చాలా కీల అంశాలను మీరు ఇందులో లేవనెత్తారు. ఎంతో తార్కికంగా మీ అభిప్రాయాలున్నాయి. మీకు నా శుభాకాంక్షలు’ అని మోడీ ఎక్స్ ద్వారా తెలిపారు. అంతేకాక ఈ ఎపిసోడ్ పున:ప్రసారాన్ని అందరూ చూడాలని కోరారు. కొంపెల్ల మాధవీలతకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. అయినా బిజెపి టికెట్ ఇచ్చింది. ఆమె ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడు అసదుద్ధీన్ ఓవైసీపై పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు కేంద్ర ప్రభుత్వం వై-ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది. ఆమె హైదరాబాద్ పాత బస్తీలో తొమ్మిదేళ్లుగా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News