హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీకి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కీలక విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోడీకి కెటిఆర్ ట్వీట్ చేశారు. కంచ గచ్చిబౌలి భూముల ఆర్థిక అక్రమాలపైన విచారణ చేపట్టి కాంగ్రెస్ బిజెపి కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలని ప్రధానికి కెటిఆర్ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విధ్వంసంపైన ప్రధానమంత్రి మాట్లాడింది కేవలం బూటకం కాకుంటే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కంచ గచ్చిబౌలి భూముల్లో 10 వేల కోట్ల ఆర్థిక మోసానికి పాల్పడిందని ఆరోపణలు చేశారు. ఇప్పటికే సిబిఐ, సెబీ, ఆర్బిఐ సంస్థలకు ఆధారాలతో సహా కాంగ్రెస్ చేసిన పదివేల కోట్ల ఆర్థిక మోసం గురించి తెలియజేశామన్నారు. సుప్రీంకోర్టు పంపించిన కేంద్ర సాధికార కమిటీ కంచ గచ్చిబౌలి భూములలో ఆర్థిక అవకతవకలు జరిగిన అంశాన్ని నిర్ధారించిందని గుర్తు చేశారు. కంచ గచ్చిబౌలిలో చేసిన పదివేల కోట్ల రూపాయల ఆర్థిక అక్రమాలపైన వెంటనే కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలి ప్రధానికి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.
- Advertisement -