Monday, December 23, 2024

మనది పురోగామి దేశం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కొవిడ్- 19 మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అనూహ్య స్థితికి చేరినా భారత్ ఆర్థిక శక్తిగా పురోగతి సాధించిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. శనివారం రాష్ట్రంలో రూ. 11,300 వేల కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పథకాలకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంతో, కొవిడ్- 19 మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అనూహ్య స్థితి చేరిన క్రమంలో సైతం ఆధునిక మౌలిక సదుపాయాల కోసం రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టిన అతికొద్ది దేశాలలో భారత్ ఒకటని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ ఏడాది బడ్జెట్‌లో దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.10లక్షల కోట్లు కేటాయించినట్లు ఆయన తెలియజేశారు. నవభారతంలో దేశ ప్రజల కలలను నిజం చేయడమే తమ ధ్యే యమని ప్రధాని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఏడు టెక్స్‌టైల్ పార్కుల ను కేంద్రం ఏర్పాటు చేస్తోందని, తెలంగాణకు ఒకటి కేటాయించామని, దీంతో ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని మోడీ తెలిపారు.

కానీ పిడికేడంతా కూడా లేని కొందరు వ్యక్తులు దేశ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరో పించారు. కొన్ని పార్టీలు అందరినీ తమ నియం త్రణలో ఉంచుకోవాలని చూస్తాయని, వాళ్లని ఏమైనా ప్రశ్నిస్తే వారికి న చ్చదని విమర్శించారు. సామాన్యుల రేషన్, ప్రజా సంక్షేమం కోసం అందించే నిధులు కూడా వారి ఖాతాల్లోనే దాచుకుంటు న్నారని ప్రధాని మోడీ ఆరోపించారు. అవినీతిని ఎదుర్కోవాలా వద్దా.. వారిని ప్రశ్నించాలా వద్దా.. ప్రజలు నిర్ణయించాలని.. అవినీతి చేసే పార్టీలకు చెక్ పెట్టాలా వద్దా.. వారికి బ్రేకులు వే యాలా వద్దా అని ప్రధాని ప్రశ్నించారు. 2014 తర్వాత దేశా నికి సంకెళ్ల నుంచి విముక్తి లభించిందన్నారు. రాబోయే 25 ఏండ్లలో దేశంతో పాటు తెలంగాణకు మహర్దశ ఉంటుందని,తెలంగాణ ప్రజలు కోరుకున్న కలలను నిజం చేసేందుకు కృషి చేస్తున్నామని ప్రధాని మోడీ వివరించారు.

తెలంగాణ అభివృద్ధి విషయంలో రాష్ట్రం కలిసి రావడం లేదన్నారు. బిజెపిని ఆశీర్వ దిస్తే తెలంగాణను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని ప్రధాని వెల్లడించారు. ప్రజల సొమ్ము అవినీతిపరులకు చేర కుండా చర్యలు తీసుకుంటున్నాం. నేరుగా రైతులు, విద్యార్థుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నాం. డిజిటల్ విధానం ద్వారా దళారీ విధానం లేకుండా చేశాం. నిజాయితీతో పనిచేసే వా రంటే అవినీతిపరులకు భయం అన్నారు. అంతకుముందు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట్ విమానాశ్రయానికి వ చ్చిన ప్రధానికి ఘన లభించింది. విమానాశ్రయంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సిఎస్ శాంతికుమారితో పాటు ఎంపిలు బండి సంజయ్, సోయం బాపూరావుతో పాటు పలువురు ఎంపిలు, ఎంఎల్‌ఎలు, అధికారులు మోడీకి స్వాగతం పలికారు. పరేడ్ మైదానం సభ అనంతరం బేగంపేటకు చేరుకున్న ప్రధాని.. అక్కడి నుంచి నేరుగా చెన్నైకు వెళ్లారు.

ఎంఎంటిఎస్ రెండో దశను ప్రారంభించిన ప్రధాని..

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి పరేడ్ మైదానానికి చేరుకున్న ప్రధాని మోడీ… అక్కడ ఏర్పాటు చేసిన సభావేదికపై నుంచి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్,- సికింద్రాబాద్ జంటనగరాల సబర్బన్ పరిధిలో 13 కొత్త ఎంఎంటిఎస్ సర్వీసులను ప్రధాని ప్రారంభించారు. రెండోదశలో భాగంగా.. మేడ్చల్– సికింద్రాబాద్, -ఉందానగర్, తెల్లాపూర్ మధ్య ఈ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అనంతరం బీబీనగర్ ఎయిమ్స్ నూతన భవన సముదాయం నిర్మాణానికి ప్రధాని సభా వేదిక నుంచే వర్చువల్‌గా అంకురార్పణ చేశారు. రూ. 720 కోట్లతో మూడు దశల్లో చేపట్టే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులకూ ప్రధాని శంకుస్థాపన చేశారు. మొదటి దశ పనులు 16 నెలల్లో, రెండో దశ 28, మూడోదశ పనుల 36 నెలల్లో… పూర్తి కానున్నాయి. 1410 కోట్ల నిధులతో దాదాపు 85.24 కిలోమీటర్ల మేర సికింద్రాబాద్– మహబూబ్ నగర్ ప్రాజెక్ట్ డబ్లింగ్ విద్యుదీకరణను ఈ సందర్భంగా మోదీ జాతికి అంకితం చేశారు.

రూ.7,864 కోట్లతో జాతీయ రహదారుల విస్తరణ..

రూ.7,864 కోట్లతో చేపట్టే… ఆరు జాతీయ రహదారుల విస్తరణకూ ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. అక్కల్‌కోట్ — కర్నూలు, మహబూబ్ నగర్ — చించోలి, కల్వకుర్తి –కొల్లాపూర్, నిజాంపేట్– నారాయణఖేడ్, – బీదర్‌తో పాటు ఖమ్మం– దేవరపల్లి మధ్య జాతీయ రహదారులను ఇందులో భాగంగా నిర్మించనున్నారు. ఖమ్మం– దేవరపల్లి రహదారిని నాలుగు వరుసలతో గ్రీన్ ఫీల్డ్ కారిడార్‌గా నిర్మించనున్నారు. మహబూబ్ నగర్– చించోలి మార్గాన్ని.. 1,334 కోట్లతో రెండు ప్యాకేజీలుగా విస్తరించనున్నారు. మిగిలిన నాలుగు రహదారుల పనులను… ఒక్కో ప్యాకేజీగా చేపట్టనున్నారు.

కేంద్ర బడ్జెట్‌లో రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్లు : అశ్విని వైష్ణవ్, కేంద్ర రైల్వేమంత్రి
2014 కంటే ముందు రూ. 50 వేల కోట్లతో రైల్వేబడ్జెట్ ఉండేదని.. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో రైల్వేల కోసం ప్రధాని నరేంద్ర మోడీ రూ.2 లక్షల 40 వేల కోట్లు కేటాయించారని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2014కి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రూ. 8 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. కానీ ప్రస్తుతం ఒక్క తెలంగాణ కోసం బడ్జెట్‌లో రూ. 4,400 కోట్లు కేటాయించారు. తెలంగాణలో రైల్వే సేవల విస్తరణకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు.

రాష్ట్రంలో అనేక సౌకర్యాలు కల్పిస్తాం : కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి
రాష్ట్రంలో అనేక సౌకర్యాలు కల్పించేందుకు ప్రధాని పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. వచ్చే 40 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ స్టేషన్ ఆధునికీకరణ పనులు చేపడుతున్నాం. ఎలాంటి భేదభావాలు లేకుండా ప్రధాని అభివృద్ధి చేస్తున్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేది ప్రధాని సంకల్పం.- వందే భారత్ ట్రైన్ ను తెలంగాణ, ఎపి ప్రజలకు ప్రధాని అంకితం చేశారు. లక్ష కోట్లకు పైగా నిధులతో తెలంగాణలో జాతీయ రహదారులు నిర్మించనున్నాం. అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News