Sunday, December 22, 2024

పామాయిల్ రైతులకు మోడీ సర్కార్ మొండిచేయి: కోదండరెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ :  రాజీవ్ గాంధీ హయాంలో పామాయిల్ ఆయిల్ ఉత్పత్తి ఇతర దేశాలకు అయ్యేదని, యూపీఏ హయాంలో పామాయిల్ రైతులకు సపోర్ట్ బాగా ఇచ్చిందన్నారు. ప్రస్తుతం పామాయిల్ రైతులకు మోడీ సర్కార్ మొండిచేయి చూపుతోందని జాతీయ కాంగ్రెస్ సెల్ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పామాయిల్ రైతుల సమస్యల గురించి రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్లానని, రైతులను కూడా రాహుల్‌గాంధీకి కలిపించానని ఆయన పేర్కొన్నారు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఖమ్మం సభకు ఆదివారం రాహుల్ వచ్చినప్పుడు పామాయిల్ రైతుల పక్షాన వినతిపత్రం ఇచ్చానని ఆయన తెలిపారు.

14 మిలియన్ టన్నుల పామాయిల్ తోటలు పెంచి రైతులు సాగుచేస్తున్నారని, వారి సమస్యలను రాహుల్ దృష్టికి తీసుకెళ్లానని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యలపై సానుకూలంగా రాహుల్ స్పందించారని ఆయన తెలిపారు. భారత దేశ సంపద ఒక్కరిద్దరి చేతుల్లోకి వెళ్తుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదానీకి పామాయిల్‌ను దిగుమతి చేసుకోడానికి సుంకాన్ని మోడీ ప్రభుత్వం మిహాయింపు ఇచ్చిందన్నారు. ఈ విషయంపై జాతీయ స్థాయిలో ఏఐసిసి ఓ నిర్ణయం తీసుకొని పోరాటం చేయాలని రాహుల్‌గాంధీకి సూచించానన్నారు. ఒక వ్యక్తి కోసం బిజెపి, మోడీ తీసుకునే నిర్ణయాలు సరైనవి కావన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News