Friday, January 24, 2025

రాహుల్ అనర్హతలో మోడీ సర్కార్ అత్యుత్సాహం: పొన్నాల

- Advertisement -
- Advertisement -

మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల

సంగారెడ్డి: ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన భాధ్యత దేశ ప్రజలపై ఉందని, దేశంలో బిజెపి సర్కార్ ప్రజా స్వామ్యాన్ని ఖూనీచేస్తుందని మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మళరెడ్డితో కలిసి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ… దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఘనత రాహుల్ గాంధీ కుటుంబానిదన్నారు. మోడీ సర్కార్ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తుండడంతో రాహుల్ గాంధీపై బిజెపి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంపి పదవికి సైతం అనర్హత వేటు వేయడం సిగ్గుచేటన్నారు.

2014 ఎన్నికల నుండి దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వా త బిజెపి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుందని, మత విద్వేశాలు రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని విమర్శించారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావడంతో బిజెపిలో వణుకు మొదలైందన్నారు. మోడీ ఆదానీల అవినీతిని ప్రశ్నిస్తుండడంతో కోర్టు తీర్పుల ద్వారా వేగంగా అనర్హత వేటు వేశారన్నారు. దేశంలో పేద ప్రజలు బిజెపి పెంచిన ధరలతో మోయలేని భారాన్ని మోస్తున్నారని, దేశంలో మోడీ పాలనకు ప్రజలు అంతం పలికేందుకు సిద్దంగా ఉన్నారని దుయ్యబట్టారు.

రాహుల్‌గాంధీకి 30రోజుల సమయం కోర్టు ఇచ్చిన పార్లమెంట్ సెక్రటరీ నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. 10లక్షల కోట్టు కార్పోరేట్లకు మాఫీ చేశారని రైతులకు ఏమి ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన ప్రజాస్వమ్య రక్షణకు కాంగ్రెస్ నిరంతరం పోరాటాం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జార్జి, సంతోష్, బుచ్చిరాములు, సత్యనారాయణ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News