Friday, April 25, 2025

ఊహించని రీతిలో ఉగ్రవాదులకు శిక్ష

- Advertisement -
- Advertisement -

ప్రతి టెర్రరిస్టును వేటాడి, వెంటాడి శిక్షిస్తాం ప్రపంచంలో ఏ మూలలో
నక్కినా వెంబడిస్తాం వారికి మద్దతిచ్చిన వారినీ మట్టిలో కలిపే
సమయం ఆసన్నమైంది 140కోట్ల మంది ప్రజల సంకల్పం ఇదే
పహల్‌గామ్‌లో జరిగింది పర్యాటకులపై దాడి కాదు..భారతీయ ఆత్మపై
జరిగిన దాడి భారతీయ సమాఖ్యతా స్ఫూర్తిని టెర్రరిజం విచ్ఛిన్నం
చేయలేదు బీహార్‌లో జరిగిన సభలో ప్రధాని మోడీ తీవ్ర హెచ్చరిక

పహల్‌గామ్ ఉగ్రదాడి వెనక ఉన్నవారు.. కుట్రలో భాగమైన వారికి ఊహకందని రీతిలో శిక్ష విధిస్తాం. ప్రతి ఉగ్రవాదిని గుర్తించి, ట్రాక్ చేసి, శిక్షిస్తామని యావత్ భారతీయులకు హామీ ఇస్తున్నా.ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసేందుకు సమయం ఆసన్నమైంది.
-ప్రధాని మోడీ

మధుబని(బీహార్): జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్‌లో టెర్రరిస్ట్‌లదాడిలో26 మం ది మరణించిన ఘటనపై ప్రధాని తీ వ్రఆగ్రహాన్ని, ఆవేశాన్ని వ్యక్తం చేశారు. భారతదేశం ప్రతి టెర్రరిస్ట్ ను వేటాడి మరీ వా రినీ, వారికి మద్దతు ఇచ్చేవారిని వాళ్లు జ న్మలో ఊహించని విధంగా శిక్షించి తీరుతుందని ప్రధాని మోదీ హెచ్చరించారు. భారతీయ ఐక్యతా స్ఫూర్తి ఎప్పటికీ విచ్ఛి న్నం కాబోదని స్పష్టం చేశారు. బీహార్ లో ని మధుబనిలో ఒక ప్రభుత్వ కార్యక్రమం లో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని ఆరంభంలోనే పహర్గామ్ లో ఉగ్రవాదుల దా డిలోమరణించిన వారికి నివాళులర్పించి అనంతరం ప్రసంగించారు.

టెర్రరిస్ట్ చ ర్య దేశంలో ప్రజలందరినీ కలచివేసిందన్నారు. దేశం మొత్తం మృతుల కుటుంబాలకు అండదండగా ఉంటుందని, గా యపడినవారంతా కోలుకునేలా ప్రభు త్వం శాయశక్తులా కృషి చేస్తుందని మో దీ స్పష్టం చేశారు. ఎందరో ప్రాణాలు కో ల్పోయారు. వారిలో ఒకరి కొడుకు, మరొకరి సోదరుడు, మరో సోదరి తన భర్తను కోల్పోయింది. వారిలో వివిధ భాషలు మాట్లాడే వారు ఉన్నా వారంత భారతీయులే అంటూ ప్రధాని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కార్గిల్ నుంచి కన్యాకుమారివరకూ  ఉన్న ప్రజలు కన్నీటిపర్యంత అయ్యారు. టెర్రరిస్ట్ లపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇది అమాయక పర్యాటకులపై దాడి కాదు. శతృవులు భారతదేశం ఆత్మ పై చేసిన దాడి ఇది అని అంటూ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు ప్రధాని. దాడిలో పాల్గొన్న టెర్రిరిస్ట్ లు, దాడికి కుట్రపన్నిన వారు జన్మలో ఊహించలేని విధమైన శిక్ష ఎదుర్కొంటారని మోదీ అన్నారు. వారందరికీ బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది 140 కోట్ల మంది ప్రజల సంకల్పం అదే… ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇస్తున్నవారిని సమూలంగా నాశనంచేస్తుందని, ఉగ్రవాద చర్యలకు మద్దతు ఇస్తున్న పాకిస్తాన్ ను ఉద్దేశించి ప్రధాని అన్నారు.

టెర్రరిస్ట్‌లను వేటాడి, వేధించి మరీ శిక్షిస్తాం

ఇదే వేదిక నుంచి ప్రపంచానికి ఓ సందేశం పంపుతూ మోదీ.. భారతదేశం ప్రతి ఉగ్రవాదినీ, వారికి మద్దతు ఇచ్చేవారిని గుర్తించి, పట్టుకుని వేధించి మరీ శిక్షిస్తుంది. ప్రపంచంలో ఎక్కడ దాగిఉన్నా. వెంబడించి మరీ కఠినంగా శిక్షిస్తాం అని అన్నారు. భారతీయ సమైక్యతా స్ఫూర్తిని టెర్రరిజం విచ్ఛిన్నం చేయబోదని స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు శిక్ష తప్పదు. ఈ అంశంలో దేశం దృఢంగా ఉంది. మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ భారత్ తో ఉన్నారని, అన్నారు. ఈ సమయంలో భారతదేశానికి దన్నుగా నిలిచిన వివిధ దేశాల ప్రజలకు, నాయకులకూ కృతజ్ఞతలు తెలుపుతున్నానని ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు. సౌదీ అరేబియాలో అధికారపర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ.. టెర్రరిస్ట్ దాడి వార్త తెలియడంతో పర్యటన రద్దుచేసుకుని తక్షణం స్వదేశం చేరుకున్నారు. ప్రధాని ఆధ్వర్యంలో బుధవారం రాత్రి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ పై దౌత్యపరమైన కఠిన చర్యతీసుకోవాలని నిర్ణయించింది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది.

వాఘా వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పాక్ జాతీయులకు వీసాలు నిలిపివేస్తూ, పాక్ పౌరులు ఎవరూ భారతదేశంలో పర్యటి ంచడానికి అనుమతించబోమని పాకిస్తాన్ హైకమిన్‌కు తెలియజేసింది. అలా గే మే 1 నాటికి హైకమిషన్ల లోని దౌత్యసిబ్బంది సంఖ్య ను 55నుంచి 30కి తగ్గించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News