Saturday, April 5, 2025

మోడీ రాజీనామా చేయాలి: మమతా బెనర్జీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ లో 30 సీట్ల ఆధిక్యం పొందాక పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాలిఘాట్ వద్ద ప్రెస్ మీట్ పెట్టారు. ‘‘ ఈ ఫలితా మోడీ అన్ని క్రెడిబిలిటీలను కోల్పోయారని రుజువు చేస్తున్నందున ఆయన వెంటనే రాజీనామా చేయాలి’’ అన్నారు.

ఇప్పటి వరకు టిఎంసికి చెందిన ఐదుగురు అభ్యర్థులు మహువా మోయిత్రా, శతృఘ్న సిన్హా, కీర్తి ఆజాద్, రచనా బెనర్జీ, కళ్యాణ్ బెనర్జీ విజేతలుగా ప్రకటితులయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థులు కూడా గణనీయంగానే విజేతలయ్యారు. పశ్చిమ బెంగాల్ లో బిజెపి వెనుకంజలో ఉంది.

పశ్చిమ బెంగాల్ పోలింగ్ ఏడు దశలలో జరిగింది. 42 మంది ఎంపీ కోసం ఈ పోలింగ్ జరిగింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News