Tuesday, September 17, 2024

75వ ఏట మోడీ రిటైర్ కావాల్సిందే.. లేకపోతే: సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బిజెపిలో ఇప్పటి ఫైర్‌బ్రాండ్ ఎంపి, మాజీ మంత్రి సుబ్రమణ్యస్వామి ప్రధాని మోడీపై మరోసారి విరుచుకుపడ్డారు. సెప్టెంబర్ 17న మోడీ 75వ ఏడాదిలోకి ప్రవేశిస్తారు. ఆ రోజున ఆయన ఖచ్చితంగా, ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ సంస్కార్‌కు కట్టుబడి మార్గ్ దర్శన్ మండల్ ముందు రాజకీయాల నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఆయనే స్వయంగా ఈ రిటైర్మెంట్ ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఒక వేళ ఇది చేయకుండా కొనసాగితే ఆయనను ఇతరత్రా పద్ధతులతో పదవీచ్యుతులను చేయాల్సి వస్తుందని స్వామి సంచలనాత్మక హెచ్చరికలు వెలువరించారు. మోడీపై rz ఇటీవలి కాలంలో ఈ బిజెపి అసంతృప్తి నేత తరచూ విమర్శలకు దిగుతున్నారు. గత వారం ఆయన మోడీ హయాంలో జిడిపి దిగజారిందని, అయితే ఎగబాకిందని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.

ఇప్పుడు ఏకంగా ఆయన పక్కకు వైదొలిగి, కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సి ఉందని పిలుపు నిచ్చారు. ఓ వైపు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీయుడు అని పేర్కొంటూ, కోర్టులను కూడా ఆశ్రయిస్తూ, మరో వైపు పాలక పక్ష నేత మోడీపై కూడా చెడుగుడుకు దిగుతున్నారు. బిజెపి సంస్థాగత అంతర్గత సంవిధానంలో భాగంగా నేతలకు వయోపరిమితి నిబంధన అలిఖితంగా అమలులో ఉంది. దీని మేరకు ఏ వ్యక్తి అయినా తన 75వ ఏడాదిలోకి వస్తే రంగంలో నుంచి తెరమరుగు కావాల్సి ఉంటుంది, కొత్త తరానికి స్థానం కల్పించాలి. ఇంతకు ముందటి నేతలు ఈ విధానాన్ని పాటించారని స్వామి తరచూ చెపుతున్నారు. దీనిని మోడీ పాటిస్తే సరి లేకపోతే ఆయనను ఏ విధంగా సాగనంపాలనేది తేల్చుకుంటామని, దీనికి తమ వద్ద పలు ఇతర మార్గాలు ఉన్నాయని కూడా స్వామి ప్రకటించారు.

పనిలో పనిగా స్వామి భారతదేశ సమగ్రతకు మోడీ అవలంభిస్తున్న విధానాలు భంగకరం అవుతాయని అభిప్రాయపడ్డారు. ఇరుగుపొరుగు దేశాలతో ఆయన వ్యవహార శైలి వల్ల ఆయా దేశాలు కక్ష కట్టడం జరుగుతుంది. ఈ క్రమంలో దేశంలోని పలు ప్రాంతాల్లో అస్థిరత నెలకొంటుందన్నారు. మాల్దీవులు, ఇటు బంగ్లాదేశ్‌లలో తలెత్తిన పరిణామాలను ఇప్పటికైనా మోడీ గుర్తించాల్సి ఉంటుందని స్వామి సూచించారు. చైనా, పాకిస్థాన్, శ్రీలంక చివరికి నేపాల్, మరో వైపు సమీపంలోని దీవులతో కూడా మోడీ అనుసరిస్తున్న వ్యూహం చివరికి మన కొంప ముంచే స్థాయికి తెస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News