Thursday, December 26, 2024

మోడీ అండ్ కో మౌనం.. దేనికి సంకేతం?

- Advertisement -
- Advertisement -

భారతదేశంలో పలుకుబడి కలిగిన ఒక వ్యాపారవేత్త మీద అమెరికా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేస్తే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వంగానీ, ప్రధానమంత్రి గాని, కనీసం హోంమంత్రి గాని దీని గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లోని పాలకులు కూడా నోరు విప్పకపోవడం వింతైన విషయం ఏమీ కాదు. నిజంగా సౌర విద్యుత్ కొనుగోళ్ల విషయంలో అవినీతి జరిగిందా లేదా అన్న విషయం ప్రస్తుతానికైతే ఆరోపణ మాత్రమే.

అమెరికా చట్టాల ప్రకారం అప్పీల్ చేసుకుంటాడో, ఒప్పందాల ద్వారా లేదా జరిమానాలు చెల్లించడం ద్వారా సమస్యను పరిష్కరించుకుంటాడో అది అదానీ తల నొప్పి. అటువంటిదేమన్నా జరిగి తన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన అమెరికావారికి మొత్తం డబ్బు అదానీ తిరిగి ఇచ్చేస్తే అమెరికాలో ఆ సమస్య అక్కడితో ముగిసిపోతుంది. అప్పుడు ఈ వ్యవహారంలో చెలరేగిపోయి అడ్డగోలు ప్రచారాలు చేస్తున్న ఒక వర్గం మీడియాగానీ, కొందరు రాజకీయ నాయకులు గానీ మొహం ఎక్కడ పెట్టుకుంటారు?

అప్పుడు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గురించి మాట్లాడినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ వ్యవహారంలో బాధ్యులుగా చేర్చాల్సిన పరిస్థితి వస్తుంది కదా? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మిత్రపక్షంగా ఉన్నందున, పైగా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఆ పార్టీతో కలిసి అధికారం పంచుకుంటున్న కారణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆచితూచి ఈ వ్యవహారంలో స్పందించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కోసం అదానీ ఫౌండేషన్ నుండి 100 కోట్ల రూపాయల విరాళం స్వీకరించినందుకు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలన్నది బిఆర్‌ఎస్ పార్టీ డిమాండ్. ఇది విచిత్రం కాక మరేమిటి? చట్టానికి లోబడే ఒప్పందాలు కొనసాగుతాయని, అదానీ అవినీతి నిరూపితమైతే ఒప్పందాలు రద్దు చేసుకుంటామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టంగా ప్రకటించారు.

ఈ వ్యవహారం మొత్తంలో ముందుగా విమర్శించాల్సి వస్తే మోడీ మౌనాన్ని విమర్శించాలి. వ్యవహారం బయటికి వచ్చి 48 గంటలు గడుస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి. ఆ తర్వాత రాష్ట్రాల్లో ఏదైనా అవినీతి జరిగి ఉంటే వాటి గురించి మాట్లాడాలి. ఆ నాయకుల గురించి మాట్లాడాలి.

దేశంలో ఇవాళ ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉన్నది. ముఖ్యంగా రాజకీయపక్షాల పరిస్థితి మింగలేరు కక్కలే రు అన్నట్టుగా తయారయింది ఒక వ్యవహారంలో. దేశంలోనే అత్యంత ధనికులలో రెండవ స్థాయిలో ఉన్న బడా వ్యాపారవేత్త గౌతమ్ అదానీ మీద అమెరికా కోర్టు ఒకటి అరెస్టు వారం టూ జారీ చేసింది. ఆయన భారతదేశంలోనే కాక ప్రపంచంలోని పలు ఇతర దేశాల్లో కూడా వ్యాపారాలు సాగిస్తున్న వ్య క్తి. భారతదేశంలోని ఏలికలకు అత్యంత ఆప్తుడైన వ్యక్తి. ఆయన మీద అమెరికాలో అరెస్టు వారెంట్ జారీ అయింది. అమెరికాలో పెట్టుబడులు సేకరించి ఆ పెట్టుబడులను భారతదేశంలో లంచాల కింద చెల్లించాడనే ఫిర్యాదు మీద దర్యాప్తు జరిపిన అమెరికా సంస్థలు ఇచ్చిన నివేదిక మేరకు అదాని అరెస్టుకు ఆదేశాలు జారీ అయ్యాయి. అనేక ఇతర వ్యాపారాలతో అదానీకి సౌర విద్యుత్తుకు సంబంధించిన వ్యాపారాలు కూడా ఉన్నాయి. సౌ ర విద్యుత్ ఉత్పత్తి సరఫరాకు సంబంధించి భారతదేశంలోని ఐదు రాష్ట్రాలలో ఆయన లంచాలు ఇచ్చి ప్రాజెక్టులు దక్కించుకున్నాడని ఆరోపణ. అలా ఆయన లంచాలు ఇచ్చిన డబ్బు అ మెరికాలో పెట్టుబడులుగా సేకరించిందేనని అక్కడ ఫిర్యాదు.

అమెరికాలో పెట్టుబడిదారులకు అసత్యాలు చెప్పి పెట్టుబడు లు సేకరించి భారతదేశంలోని ఒరిస్సా, తమిళనాడు, చత్తీస్ గఢ్, జమ్మూ కశ్మీర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అధికారులకు ఆ సొమ్మును ముడుపులుగా చెల్లించాడని అదానీ మీద అమెరికాలోని బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో కేసు నమోదు అయింది. ఆ కేసులో న్యాయస్థానం అదానీ అరెస్టుకు వారెంట్ జారీ చే సింది. మామూలు పరిస్థితుల్లో, మామూలు పద్ధతుల్లో, మా మూలు వ్యక్తుల విషయంలో అయితే ఏం జరగాలి? అమెరికా కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది కాబట్టి ఆ వ్యక్తిని అరెస్టు చేసి అమెరికాకు అప్పగించాలి. అయితే ఇది మామూలు పరిస్థితి కాదు. ఈ మొత్తం వ్యవహారంలో ఇరుక్కున్న వ్యక్తి మా మూలు వ్యక్తి కాదు. అదానీని అరెస్టు చేసి అమెరికాకు అప్పగించడం ఇవాళ భారతదేశంలో ఉన్న పరిస్థితుల్లో సాధ్యం అ య్యే పనేనా? ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వార్త వె లువడిన వెంటనే అదానీని అరెస్టు చేయాలి, జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలి, ఒప్పందంలో దాగి న అవినీతిని బయట పెట్టాలని డిమాండ్ చేసారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకి) సంస్థలో జరిగిన అక్రమాలన్నీ బయటికి రావాల్సిందే అని రాహుల్ గాంధీ పట్టు పడుతున్నారు.

అవినీతి ఎక్కడ జరిగినా, అందునా ప్రజాధనం దుర్వినియోగం అయిన సందర్భాలలో తప్పనిసరిగా చర్యలు ఉండాలనేది నిర్వివాదాంశం. కానీ మొదట్లో చెప్పినట్టుగా ఇ క్కడ ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. రాజకీయ నా యకులు ఇక్కడ ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అనే ఆం దోళనలో ఉన్నారు. ఈ ఐదు రాష్ట్రాల గురించి మాట్లాడుకుం దాం. ఒడిస్సా రాష్ట్రంలో బిజూ జనతాదళ్ నాయకుడు నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇది జరిగిందనే ది ఆరోపణ. ప్రస్తుతం ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ ప్ర భుత్వం ఉన్నది. అప్పుడు సౌర విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో అవినీతి జరిగిందన్న విషయంలో దర్యాప్తు జరిపించి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం మీద, ఆయన హయాంలో పనిచేసిన అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి అక్కడి బిజెపి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదా? ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామిగా ఉన్నఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నది. ఈ అవినీతి జరిగిందని చెప్తున్న కాలం లో అక్కడ అధికారంలో ఉన్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని, ఆయన పార్టీ వైఎస్‌ఆర్ కాం గ్రెస్ పార్టీని అప్రతిష్టపాలు చెయ్యడానికి అవకాశంకోసం అహర్నిశలూ గోతికాడ నక్కల్లాగా కాచుకు కూర్చు నే ఒక వర్గం మీడియా చేస్తున్న హడావుడి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అంతా ఇంతా కాదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడు మాత్రం ఈ వ్యవహారాన్ని లోతుగా అధ్యయనం చే యాలి, న్యాయ నిపుణుల అభిప్రాయం తెలుసుకోవాలి వంటి పొడి పొడి మాటలతో సరిపెట్టారు.

అసలు వీళ్లంతా కాదు, భారతదేశంలో అంత పలుకుబడి కలిగిన ఒక వ్యాపారవేత్త మీద అమెరికా కోర్టు అ రెస్ట్ వారెంట్ జారీచేస్తే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వంగానీ, ప్రధానమంత్రి గాని, కనీసం హోంమంత్రి గాని దీని గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లోని పాలకు లు కూడా నోరు విప్పకపోవడం వింతైన విషయం ఏమీ కాదు. నిజంగా సౌర విద్యుత్ కొనుగోళ్ల విషయంలో అవినీతి జరిగిందా లేదా అన్న విషయం ప్రస్తుతానికైతే ఆరోపణ మాత్ర మే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు మాట్లాడుతూ చాలా స్పష్టంగా తమ హయాంలో ఏం జరిగిందో వివరంగా చెబుతున్నారు.సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఆ సంస్థకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందాలే తప్ప

అదానీతో రాష్ట్ర ప్ర భుత్వం ఎటువంటి ప్రత్యక్ష వ్యాపార లావాదేవీలు జరపలేద ని అప్పుడు అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్ప ష్టం చేస్తున్నది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే కేంద్ర సంస్థ గనుక తప్పు చేసి ఉంటే దాని మీద చర్యలు తీసుకోవాలి. నిజానికి ఈ సౌర విద్యుత్ అనేది ప్రధానమంత్రికి అ త్యంత ప్రియమైన పథకం. ఈ కార్పొరేషన్ మీద చర్యలు తీసుకుంటే ఆయన తీసుకోవాలి. ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉన్న చం ద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యుత్తును నాలుగు నుంచి ఆరు రూపాయలకు ఒక యూనిట్ చొప్పున కొనుగోలు చేసిం ది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ తో కుదిరిన ఒప్పందం మేరకు రెండు రూపాయల 90 పైసలకి కొనుగోళ్ళు జరిగాయి. వి ద్యుత్ ట్రాన్స్మిషన్ చార్జీల చెల్లింపులలో కేంద్రం మినహాయింపు ఇచ్చింది.
మరి ఇటువంటి వ్యవహారంలో అదానీ ఎందుకో సం ఆంధ్రప్రదేశ్‌లో ఎవరికైనా ముడుపులు చెల్లించి ఉంటా రు? ఎక్కువ ధర చెల్లించి విద్యుత్ కొనుగోలు చేయడానికి ఏ రాష్ట్రమైనా ముందుకొస్తే వాళ్లకు

ముడుపులు చెల్లించాలి కానీ తక్కువ ధరకు కొనుక్కునే వాళ్లకు ముడుపులు ఎందుకు చెల్లిస్తారు? పైగా ఆయన ప్రపంచంలోని బడా పారిశ్రామికవేత్తల్లో ఒకరు. ఆయన నుండి ముడుపులు ఎవరైనా ఎలా ఆశిస్తారు? అదానీ అరెస్టు వారెంట్ వ్యవహారంలో బయటపడిన ఐదు రాష్ట్రాల పేర్లలో జమ్మూ కశ్మీర్ కూడా ఉన్నది. ఈ వ్యవహారం జరిగిన కాలంలో ఆ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ పాలనలో ఉన్నది.అప్పుడు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గురించి మాట్లాడినప్పుడు కేంద్రాన్ని కూడా ఈ వ్యవహారంలో బాధ్యులుగా చేర్చాల్సిన పరిస్థితి వస్తుంది కదా?కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మిత్రపక్షం గా ఉన్నందున, పైగా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఆ పార్టీతో కలిసి అధికారం పంచుకుంటున్న కారణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆచితూచి ఈ వ్యవహారంలో స్పందించారు. ఈ వ్యవహారంలో బిజెపి స్పందన విచిత్రంగా ఉన్నది. అదానీని అరెస్టు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేసిన వెంటనే బిజెపి అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలే అదానీతో అంటకాగాయని విమర్శించారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతున్నదన్న విషయం చెప్పకుండా బిజెపి నేతలు కాంగ్రెస్ మీద విడుచుకుపడుతున్నారు.

తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ భారత రాష్ట్ర సమితి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలంటూ ఒ క విచిత్రమైన కోర్కెను వెలిబుచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఏ ర్పాటు చేయబోతున్న స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కోసం అదానీ ఫౌండేషన్ నుండి 100 కోట్ల రూపాయల విరాళం స్వీకరించినందుకు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలన్నది ఆ పా ర్టీ డిమాండ్. ఇది విచిత్రం కాక మరేమిటి? చట్టానికి లోబడే ఒప్పందాలు కొనసాగుతాయని, అదానీ అవినీతి నిరూపితమైతే ఒప్పందాలు రద్దు చేసుకుంటామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టంగా ప్రకటించారు.
ఇంకా కొన్ని చిత్రాలు జరుగుతున్నాయి అదాని వ్యవహారంలో. సందు దొరికితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఒంటికాలిపై లేచే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదానీ వ్యవహారంలో నోరు విప్పకపోవడం మరో ఆశ్చర్యం. అటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గానీ, ఇటు పవన్ కళ్యాణ్ గాని మొత్తానికి ఆ ప్రభుత్వంలోని పెద్ద లు ఎవరూ ఈ విషయంలో పెద్దగా మాట్లాడకపోవడానికి కా రణం అదానీ నరేంద్ర మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి అత్యంత సన్నిహితుడు కావడమేనని అందరికీ తెలుసు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పెద్దలు మాట్లాడ టం లేదు కానీ వాళ్లకు బాకాలుగా ఉన్న మీడియా మాత్రం చెలరేగి పోయి రాతలు రాస్తూ ఉన్నది, మాట్లాడుతూ ఉన్నది. అదానీకి, జగన్మోహన్ రెడ్డికి అక్రమ సంబంధం ఉందని చెప్పి బ్యానర్ వార్తలు రాస్తున్న ఆ పత్రికలు మరి మోదీ సంగతి ఏమిటి అనే విషయం మాత్రం చెప్పడం లేదు. అవకాశం దొరికింది కదా అని చెప్పి జగన్ మోహన్ రెడ్డిని అప్రతిష్టపాలు చేయడం కోసం రాస్తున్న రాతలు చూసి అందరూ నవ్వుకుంటున్నారు. ఈ వ్యవహారం మొత్తంలో ముందుగా విమర్శించాల్సివస్తే మోడీ మౌనాన్ని విమర్శించాలి. వ్యవహారం బయటికి వచ్చి 48 గంటలు గడుస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి. ఆ తర్వాత రాష్ట్రాల్లో ఏదైనా అవినీతి జరిగి ఉంటే వాటి గురించి మాట్లాడాలి. ఆ నాయకుల గురించి మాట్లాడాలి. అలాకాకుండా కోతికి కొబ్బరిచిప్ప దొరికిందన్న చందంగా గత రెండు రోజులుగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్న హంగామా అంతాఇంతా కాదు.

తెలుగుదేశం అనుకూల మీ డియా రాస్తున్న విధంగానే ఇవాళ చంద్రబాబు నాయుడు మా ట్లాడి ఉంటే మరి మోదీ సంగతి ఏంటి? ఆయన్ని ఎందుకు విమర్శించడం లేదు? ఆయన ప్రభుత్వంలో ఎందుకు భాగస్వామిగా ఉన్నారు? అని ఎవరైనా అడుగుతారన్న కారణంగా చంద్రబాబు నాయుడు నోరు మెదపకుండా తన అనుకూల మీడియాతో అవాకులు చవాకులు రాయిస్తున్నారనే విషయం అందరికీ అర్థం అవుతున్నది. ఈ వ్యవహారంలోనే మీడియావారు అడిగిన ప్రశ్నలకు జవాబు చెబుతూ చంద్ర బాబు నాయుడు.. జగన్ అవినీతిని పార్లమెంటులో ఎండగట్టండని తన కూటమి ఎంపీలను ఆదేశించినట్టు ఆయన మానస పత్రికలు రాసాయి. ఈ వ్యవహారంలో జగన్ ను విమర్శించే ముందు అదానీని, ఆ వెనక ప్రధానమంత్రిని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శించాల్సి వస్తుందన్న విషయం చంద్రబాబుకు వెంటనే తట్టినట్టు లేదు.అమెరికా చట్టాల ప్రకారం అప్పీల్ చేసుకుంటాడో, ఒప్పందాల ద్వారా లేదా జరిమానాలు చెల్లించడం ద్వారా సమస్యను పరిష్కరించుకుంటాడో అది అదానీ తల నొప్పి. అటువంటిదేమన్నా జరిగి తన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన అమెరికావారికి మొత్తం డబ్బు అదానీ తిరిగి ఇచ్చేస్తే అమెరికాలో ఆ సమస్య అక్కడితో ముగిసిపోతుంది. అప్పుడు ఈ వ్యవహారంలో చెలరేగిపోయి అడ్డగోలు ప్రచారాలు చేస్తున్న ఒక వర్గం మీడియాగానీ, కొందరు రాజకీయ నాయకులు గానీ మొహం ఎక్కడ పెట్టుకుంటారు?

దేవులపల్లి అమర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News