ఢిల్లీ: లోక్ సభ 2047 వికసిత్ భారత్ సంకల్పం, కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగుతామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కొత్త పార్లమెంటు భవనంలో లోక్ సభ సమావేశాలు సందర్భంగా మోడీ మాట్లాడారు. లోక్ సభ సభ్యులకు పిఎం మోడీ స్వాగతం పలికారు. ఇది చాలా పవిత్రమైన రోజు అని పేర్కొన్నారు. 140 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేరస్తామని, సామాన్య ప్రజల కలలు సాకారం చేస్తామని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తామన్నారు. మూడోసారి సేవచేసే భాగ్యాన్ని ప్రజలు కల్పించారని, సభ్యులందరినీ కలుపుకొని వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకుంటామని మోడీ వివరించారు. ప్రజలు మా విధానాలను విశ్వసించారని, సరికొత్త విశ్వాసంతో కొత్త సమావేశాలు ప్రారంభిస్తున్నామని, రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల స్వప్నం నెరవేర్చే సంకల్పం తీసుకున్నామని, రేపటితో అత్యయిక పరిస్థితి 50 ఏళ్లు పూర్తివుతుందని, అత్యయిక పరిస్థితి ఒక మచ్చ అని, 50 ఏళ్ల క్రితం జరిగిన పొరపాటు పునరావృతం కాకూడదని మోడీ తెలిపారు.
కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగుతాం: మోడీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -