Wednesday, January 22, 2025

22న అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో మోడీ ప్రసంగం

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో తన అధికార పర్యటనలో భాగంగా ఈ నెల 22న అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని కాంగ్రెస్‌కు చెందిన నేతలు శుక్రవారం ప్రకటించారు. ‘ జూన్ 22న అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి మిమ్మల్ని(ప్రధాని మోడీని)ప్రతినిధుల సభ, సెనేట్ తరఫున ఆహ్వానించడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం’ అని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రకటనపై ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెకార్తీ, సెనేట్ మెజారిటీ పక్షం నాయకుడు చక్ షూమర్, సెనేట్ రిపబ్లికన్ పార్టీ నేత మెక్ కానెల్, ప్రతినిధుల సభలో డెమోక్రటిక్ పార్టీ నేత హకీమ్ జెఫ్రీస్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News