Friday, December 20, 2024

దేశ చరిత్రలో ఇదే అత్యంత బలమైన సంకీర్ణ ప్రభుత్వం: మోడీ

- Advertisement -
- Advertisement -

పరస్పర విశ్వాసమే ఎన్‌డిఎ సిద్ధాంతం
దేశ చరిత్రలో ఇదే అత్యంత బలమైన సంకీర్ణ ప్రభుత్వం
బిజెపి విజయంపై ఓటమి ముద్ర వేసేందుకు యత్నాలు
ఫలితాల రోజే ప్రతిపక్షాల నోళ్లు మూయించిన ఇవిఎంలు
పవన్ అంటే వ్యక్తి కాదు..ఒక తుపాను
ఎన్‌డిఎ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నరేంద్ర మోడీ
సరైన సమయంలో సరైన నాయకుడు మోడీ: చంద్రబాబు
మోడీ నాయకత్వంలో వికసిత భారత్: నితీశ్ కుమార్

న్యూఢిల్లీ: తాము ఏర్పాటు చేయనున్న నూతన ప్రభుత్వంలో అన్ని నిర్ణయాలలో ఐక్యతను సాధించేందుకు కృషి చేస్తామని, దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత అన్న సూత్రానికి కట్టుబడే స్వచ్ఛమైన కూటమి ఈ ఎన్‌డిఎ అని ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకరాం చేయనున్న నరేంద్ర మోడీ శుక్రవారం ప్రకటించారు. బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎన్‌డిఎ ఎంపీల సమావేశం ఆయన ప్రసంగిస్తూ తమ ప్రభుత్వం రానున్న పదేళ్లు సుపరిపాలన, అభివృద్ధి, నాణ్యమైన జీవన ప్రమాణాలు, సామాన్య పౌరుల జీవితాలలో స్వల్ప జోక్యం వంటి అంశాలపై దృష్టి సారిస్తుందని చెప్పారు.

పరస్పర విశ్వాసమే ఈ కూటమి మూల సూత్రమని ఆయన ప్రకటించారు. సర్వజన సమభావ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వాల చరిత్రలో సంఖ్యాబరంగా చూస్తే ఇదే అత్యంత బలమైన సంకీర్ణ ప్రభుత్వమని మోడీ అన్నారు. ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధింస్తూ తమ విజయాన్ని గుర్తించడానికి కొందరు అంగీకరించడం లేదని, ఈ విజయంపై ఓటమి ముద్రను వేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు, జెడియు అధ్యక్షుడు నితీష్ కుమార్, శివసేన అధ్యక్షుడు ఏక్‌నాథ్ షిండే, ఎల్‌జెపి-ఆర్‌వి) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్, జెడిఎస్ కర్నాటక అధ్యక్షుడు హెచ్‌డి కుమారస్వామి, ఎన్‌సిపి అధ్యక్షుడు అజిత్ పవార్, అప్నాదళ్ -ఎస్ అధినేత్రి అనుప్రియా పటేల్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్న ఈ సమావేశంలో ఎన్‌డిఎ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నరేంద్ర మోడీ పేరును బిజెపి సీనియర్ నా యకుడు రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదిచగా బిజెపి అగ్రనేతలు అమిత్ షా, నితిన్ గడ్కరీతో చంద్రబాబు నాయుడు, నతీష్ కుమార్ తదతరులు కూడా బలపరిచారు.

పార్లమెంటరీ పార్టీ సమావేశంలో టిడిపి అధినేత చం ద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తూ ప్రాంతీయ ఆశయాలు, జాతీయ ప్రయోజనాలను సమతూకంతో సమాంతరంగా కానసాగించాలని పిలుపునిచ్చారు. నేడు భారత్‌కు సరైన సమయంలో సరైన నాయకుడు లభించారని ఆయన మోడీని ప్రశంసించారు. ఇది భారత్‌కు మంచి అవకాశమని, ఇప్పుడు తప్పిపోతే జీవితాంతం కోల్పోవలసి వస్తుందని ఆయన అన్నారు. మోడీ నాయక త్వం పట్ల జెడియు అధినేత నితీష్ సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News