Monday, December 23, 2024

మణిపూర్‌లో జరిగిన హింస అత్యంత బాధాకరం: మోడీ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 140 కోట్ల భారతీయులకు ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బాపూజీ చూపిన అహింస మార్గంలో స్వాతంత్య్రం సాధించామన్నారు. స్వాత్రంత్యం సమరంలో అశువులు బాసిన మహానుభావులకు నమస్సుమాంజలులు అని, ఈ ఏడాది అరవిందుడు, దయానంద సరస్వతి 150వ శతజయంతి జరుపుకుంటున్నామని తెలియజేశారు. రాణి దుర్గావతి, మీరాబాయిని స్మరించుకోవాల్సిన తరుణమిది అని కొనియాడారు. మణిపూర్‌లో జరిగిన హింస అత్యంత బాధాకరమైందని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ జరిగిన హింసాత్మక సంఘటనలు గర్హించదగినవి కావని, కొద్ది రోజులుగా మణిపూర్‌లో శాంతి నెలకుంటుందని, మణిపూర్‌కు యావజ్జాతి అండగా నిలుస్తోందని ప్రశంసించారు. మణిపూర్‌లో నూరు శాతం శాంతి సాధించాలన్న సంకల్పంతో పని చేస్తున్నామని మోడీ వివరించారు. స్వతంత్ర అమృతకాలంలో నూతనోత్తేజంతో దేశం ముందడుగు వేస్తోందని, వెయ్యేళ్ల బానిసత్వం తరువాత భారత్ స్వాతంత్య్రం పొందిందని, స్వాతంత్య్రం తరువాత ఇప్పుడు కొత్త వెలుగుల వైపు భారత్ పయనిస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News