Thursday, January 23, 2025

మన దేశ సంస్కృతికి రాముడే మూలం: మోడీ

- Advertisement -
- Advertisement -

అయోధ్య: రామనామం భారత దేశ ప్రజల కణకణంలో నిండి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. రామ భక్తులంతా ఆనంద పరశంలో మునిగితేలుతున్నారన్నారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ పురష్కారం నిర్వహించిన సందర్భంగా మోడీ ప్రసంగించారు. 2020 జనవరి 22 సాధారణ తేదీ కాదని, కొత్త కాలచక్రానికి ప్రతీక అని కొనియాడారు. ఇవాళ మన శ్రీరాముడు మళ్లీ వచ్చాడని, ఎన్నో బలిదానాలు, త్యాగాల తరువాత మన రాముడు వచ్చాడని, ఈ శుభ గడియాల్లో ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గర్భగుడిలో ఇప్పుడే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించామని మోడీ పేర్కొన్నారు. మన బాలరాముడు ఇక నుంచి టెంట్‌లో ఉండాల్సిన అవసరం లేదని, మన రామ్‌లల్లా ఇకనుంచి మందిరంలో ఉంటారని చెప్పారు.

బానిస మనస్తత్వం వదిలి సగర్వంగా తలెత్తుకొని చూస్తున్నామని, ఈ సమయానికి పరిపూర్ణ దివ్యత్వం ఉందని, పవిత్రమైన అయోధ్యాపురికి శిరసు వంచి నమస్కరిస్తున్నామని, ఈ కార్యం ఆలస్యమైనందుకు క్షమించమని రాముడిని వేడుకుంటున్నామన్నారు. ఈ క్షణం కోసం అయోధ్య ప్రజలు వందల ఏళ్లుగా నిరీక్షిస్తున్నారని, స్వాతంత్య్రం వచ్చాక కూడా దశాబ్ధాల పాటు న్యాయం పోరాటంచేశామని, ఇవాళ దేశమంతా దీపావళి జరుపుకుంటోందని, ఈ రాత్రికి ప్రతి ఇంటా దీపాలు వెలగాలని మోడీ కోరారు. ఈ శుభ గడియల కోసం 11 రోజులు దీక్షలు చేశామని, ఎపిలోని లేపాక్షిలో ప్రత్యేక పూజలు నిర్వహించామని, సాగర్ నుంచి సరయూ వరకు రామనామం జపించామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News