న్యూఢిల్లీ: తొమ్మిదవ సిక్కు గురువు తేగ్ బహదూర్ 400వ జయంత్యోత్సవాలను పురస్కరించుకుని గురువారం ఎర్రకోటలో జరిగే ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. అంతేగాక ఈ సందర్భంగా స్మారక నాణేన్ని, తపాలా బిళ్లను ప్రధాని విడుదల చేస్తారు. ఢిల్లీ సిక్కు గురుద్వారా నిర్వాహక కమిటీతో కలసి కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం బుధవారం తెలిపింది. కాగా..కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులతో మాట్లాడుతూ సిక్కు గురువులకు సంబంధించిన అనేక కార్యక్రమాలను మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహించినట్లు తెలిపారు. తొమ్మిదవ సిక్కు గురువును స్మరించుకునే ఉత్సవాన్ని నిర్వహించుకోవడానికి ఎర్ర కోటను మించిన అనువైన వేదిక మరొకటి లేదని ఆయన అన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం బుధవారం శబ్ద కీర్తనతో ప్రారంభమైంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సిక్కు మత ప్రచార గాయకులు(రాగి), పిల్లలు కీర్తనలు ఆలపించారు.
నేడు సిక్కు గురువు జయంత్యోత్సవంలో ప్రసంగించనున్న ప్రధాని మోడీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -