హైదరాబాద్: కరోనా సమయంలో తమ ప్రాణాలు పణంగా పెట్టి వైద్య సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు వందనమని ప్రధాని మోడీ అన్నారు. బుధవారం బుద్ధ పౌర్ణమి సందర్భంగా వెసాక్ వేడుకలలో మోడీ మాట్లాడారు. వైద్య సిబ్బంది సేవలను కొనియాడారు. ఆత్మీయులను పోగొట్టుకున్న వారికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కరోనా వైరస్ పై అవగాహన ఉందని, ఇప్పుడు పోరాడేందకు సిద్ధంగా ఉన్నామని, ప్రాణాలు కాపాడేందుకు, మహమ్మారిని జయించేందుకు అవసరమైన టీకా భారత్ వద్ద ఉందని ప్రశంసించారు. వ్యాక్సిన్లను తయారు చేసి శాస్త్రవేత్తలను చూసి దేశం గర్వపడుతోందన్నారు. అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య సహకారంతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 50 మంది బౌద్ధ మత నాయకులు పాల్గొన్నారు. బుద్ధ పూర్ణిమ రోజును ట్రిపుల్ బ్లెస్డ్ డేగా పరిగణిస్తారు. సాంస్కృతిక మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్, మైనారటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజీజు హాజరయ్యారు.
వైద్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివి: మోడీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -