Monday, December 23, 2024

మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు: మోడీ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ప్రసంగంలో మహిళా రిజర్వేషన్లను ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు. అనేక రంగాల్లో మహిళలు నేతృత్వం వహిస్తున్నారని, కొత్త భవనంలో నారీ శక్తిని బలోపేతం చేసేలా తొలి నిర్ణయం తీసుకోబోతున్నామని, మహిళా రిజర్వేషన్ బిల్లును సోమవారం మంత్రివర్గం ఆమోదించిందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టనుంది. మహిళా రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. లోక్‌సభ, అసెంబ్లీలో మూడో వంతు సీట్లు మహిళలకు కేటాయించేలా బిల్లు రూపొందించారు.

ఢిల్లీ అసెంబ్లీలోనూ మూడో వంతు సీట్లు మహిళలకు కేటాయించేలా బిల్లు తీసుకరానున్నారు. విధాన నిర్ణయాల్లో మహిళా భాగస్వామ్యం పెంచడమే లక్ష్యంగా బిల్లు తీసుకరానున్నారు. డీలిమిటేషన్ తరువాత అమల్లోకి మహిళా రిజర్వేషన్ బిల్లు రానుంది. 15 ఏళ్ల పాటు మహిళా రిజర్వేషన్ల బిల్లు అమల్లో ఉండనుంది. డీలిమిటేషన్ తరువాత రోటేషన్ ప్రక్రియల్లో రిజర్వు సీట్లు కేటాయిస్తారు.

పాత పార్లమెంట్ ప్రత్యేక జాయింట్ సెషన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. 86 సార్లు ఇక్కడి నుంచే రాష్ట్రపతులు ప్రసంగించారని, ఈ భవనంలోనే మనం జాతీయ గీతాన్ని ఎంచుకున్నామన్నారు. అనేక చట్టాలు, చర్చల్లో ఎందరో భాగస్వాములయ్యారని, 400లకు పైగా చట్టాలను ఈ పార్లమెంట్‌లో ఆమోదించుకున్నామని మోడీ గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News