Thursday, January 23, 2025

మోడీ నువ్వు టీవీలో కన్పిస్తూ ఉంటావు

- Advertisement -
- Advertisement -

Modi spoke to a five-year-old girl

పార్లమెంట్ హాల్‌లో ఓ పాప పరాచికం

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్‌లోని తమ ప్రత్యేక గదిలో ఐదేళ్ల బాలికతో కొద్ది సేపు బుధవారం మాట్లాడారు. మధ్యప్రదేశ్‌కు చెందిన బిజెపి ఎంపి అనిల్ ఫిరోజియా తన కుటుంబాన్ని కూడా పార్లమెంట్‌కు తీసుకువచ్చారు. ప్రధానిని కలిశారు. అనిల్ కూతురు అహనాను దగ్గరికి పిలిచి కొద్ది సేపు ముచ్చటించారు. తనను గుర్తు పడుతావా? అని బాలికను ప్రశ్నించారు. దీనికి బాలిక స్పందిస్తూ నువ్వు మోడీజీవి, రోజూ టీవీలో వస్తుంటావు అని బాలిక చెప్పింది. నేనేం చేస్తుంటానని బాలికను ప్రధాని ప్రశ్నించగా నువ్వు ఇక్కడ (లోక్‌సభలో ) పనిచేస్తుంటావు అంతే అని జవాబు చెప్పడంతో ప్రధాని , అక్కడున్న వారు చాలా సేపటి వరకూ బిగ్గరగా నవ్వారు. ఆ తరువాత ప్రధాని ఆ బాలికకు ఓ మంచి చాక్లెట్ ఇచ్చారు. ఈ మధ్యప్రదేశ్ ఎంపికి ఓ ప్రత్యేకత ఉంది. స్థూలకాయపు ఈ ఎంపికి ఇటీవలే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ సవాలు విసిరారు. బరువు తగ్గితే కిలోకు రూ 1000 కోట్ల మేర నియోజకవర్గ అభివృద్ధి పనులకు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీని స్వీకరించిన ఈ ఎంపి తాను ఇప్పుడు 21 కిలోలు తగ్గానని ఇక తన నియోజకవర్గానికి రూ 21000 కోట్లు వచ్చినట్లే అని ఈ ఎంపి ఆశలు పెట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News