- Advertisement -
భారత్ 1000వ వన్డేకు మోడీ స్టేడియం వేదిక!
అహ్మదాబాద్: ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా పేరు తెచ్చుకున్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఓ చారిత్రక మ్యాచ్‌కు వేదికగా నిలువనుంది. ఇక్కడి మొతెరా స్టేడియంలో టీమిండియాకు సంబంధించిన 1000వ వన్డే సమరం జరుగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి ఆరున ఈ చారిత్రక వన్డే పోరు జరగనుంది. టీమిండియా ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ కోసం గుజరాత్ క్రికెట్ సంఘం భారీ ఏర్పాట్లను చేయాలని నిర్ణయించింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే 1000 వన్డే మ్యాచ్‌ను ఆడనున్న తొలి జట్టుగా టీమిండియా నిలువనుంది. దీంతో ఈ మ్యాచ్‌ను అత్యంత విజయవంతంగా నిర్వహించేందుకు గుజరాత్ క్రికెట్ సంఘం, భారత క్రికెట్ బోర్డులు భారీ ఏర్పాట్లు చేయనున్నాయి.
- Advertisement -