Saturday, January 18, 2025

554 రైల్వే స్టేషన్లలో పునరాభివృద్ధి పనులను ప్రారంభించిన మోడీ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: అమృత్ భారత్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్లలో పునరాభివృద్ధి పనులు చేస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు. దేశంలోని 554 రైల్వే స్టేషన్లలో పునరాభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. తెలంగాణలో 15 రైల్వే స్టేషన్లలో పనులు ప్రారంభించారని, రాష్ట్రంలో 48 ఆర్‌ఒబిలు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి పనులు ప్రారంభించామని, రూ.41 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకస్థాపన, ప్రారంభోత్సవాలు చేశామని, రైల్వే రంగంలో వస్తున్న మార్పులను కళ్లతో ప్రజలు గమనిస్తున్నారని మోడీ పేర్కొన్నారు. గతంలో వందే భారత్ వంటి రైళ్ల గురించి ఏ ప్రభుత్వాలు ఆలోచన చేయలేదని, పదేళ్ల క్రితం వరకు రైల్వే స్టేషన్లు, బోగీల్లో అపరిశుభ్రంగా ఉండేవని ధ్వజమెత్తారు. మధ్యతరగతి వాళ్లు రైల్వే స్టేషన్‌కు వెళ్లే పరిస్థితి వచ్చిందని, పేద వారు కూడా రైళ్లలో ప్రయాణించే పరిస్థితి వచ్చిందని మోడీ కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News