Wednesday, November 27, 2024

రోడ్ షోలో మాతృమూర్తి చిత్రాన్ని చూసి కారు దిగిన మోడీ

- Advertisement -
- Advertisement -

Modi stops his car to accept painting of his mother from girl in Shimla

ఆ చిత్రాన్ని తయారు చేసిన బాలికకు అభినందనలు

సిమ్లా : ఢిల్లీకి రాజునైనా తల్లికి బిడ్డనేనన్న ఆత్మీయతను ప్రధాని మోడీ మంగళవారం రోడ్‌షోలో వెలిబుచ్చారు. హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో భాగంగా మంగళవారం సిమ్లాలో రోడ్‌షోలో తన తల్లి హీరాబెన్ మోడీ చిత్తరువును చూసి మోడీ చలించిపోయారు. కారు దిగి ఆ చిత్రాన్ని గీసిన బాలికను కుశల ప్రశ్నలడిగి అభినందించారు. సిమ్లా లోని రిడ్జ్ మైదానానికి వెళ్లే మార్గంలో మంగళవారం రోడ్ షో జరిగింది. దారి పొడవునా ర్యాలీలో ప్రధాని మోడీని సందర్శించడానికి జనం భారీగా తరలి రావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. అదే సమయంలో సిమ్లాకు చెందిన ఒక బాలిక అనూ మోడీ తల్లి హీరాబెన్ మోడీ చిత్రం పట్టుకుని నిరీక్షించ సాగింది. దీన్ని గమనించిన మోడీ తన కారును, అశ్విక దళాన్ని ఆపేసి ఆ బాలికను నేరుగా కలుసుకుని తన తల్లి చిత్రాన్ని స్వీకరించారు.

నీ పేరేంటి ? ఎక్కడ ఉంటున్నావు ? ఈ చిత్రాన్ని పెయింట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది ? అని ఆ బాలిక అనూను మోడీ ప్రశ్నించారు. తాను సిమ్లాలో ఉంటున్నానని, ఒక్క రోజులోనే ఈ చిత్రాన్ని తయారు చేశానని ఆ బాలిక మోడీకి చెప్పారు. అంతేకాదు మీ చిత్రాన్ని కూడా తయారు చేసి డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ద్వారా పంపానని ఆ బాలిక చెప్పింది. మోడీకి పాదాభివందనం చేసింది. గరీబ్ కల్యాన్ సమ్మేళన్ లో భాగంగా ప్రధాని మోడీ మంగళవారం సిమ్లాకు చేరుకున్నారు. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ( పిఎం కిసాన్ ) పథకం కింద 10 కోట్ల మంది లబ్ధిదారులకు రూ. 21,000 కోట్లు విడుదల చేశారు. ఈ గరీబ్ కల్యాన్ సమ్మేళన్ సందర్భంగా దేశం నుంచి వచ్చిన ప్రజా ప్రతినిధులతో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఎనిమిదో వార్షికోత్సవాలను ఇక్కడ నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News