Monday, December 23, 2024

వైద్య విద్యలో ప్రైవేట్ సంస్థల పాత్ర పెరగాలి

- Advertisement -
- Advertisement -
Modi stresses on need for local medical education
భూ కేటాయంపులపై రాష్ట్రాలకు ప్రధాని సూచన

న్యూఢిల్లీ: భాషాపరంగా అడ్డంకులు ఉన్నప్పటికీ వైద్య విద్య కోసం భారతీయ విద్యార్థులు అనేక చిన్న దేశాలకు వెళుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయం వ్యక్తం చేశారు. వైద్య రంగంలో ప్రైవేట్ సంస్థలు పెద్ద ఎత్తున ప్రవేశించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆరోగ్య రంగంపై కేంద్ర వార్షిక బడ్జెట్‌లో ప్రకటించిన అంశాలను చర్చించేందుకు శనివారం నిర్వహించిన ఒక వెబినార్‌లో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ వైద్య విద్య కోసం భూ కేటాయింపులు జరిపేందుకు అనువుగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మంచి విధానాలు రూపొందించాలని సూచించారు.

అలా చేయడం వల్ల ప్రపంచ అవసరాలను కూడా తీర్చేవిధంగా డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బందిని భారత్ పెద్ద సంఖ్యలో తీర్చిదిద్దగలదని ఆయన చెప్పారు. రష్యా సైనిక దాడితో ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు పెద్దసంఖ్యలో అక్కడ చిక్కుబడిపోయిన నేపథ్యంలో ప్రధాని నుంచి ఈ వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే..ప్రధాని మోడీ నేరుగా ఉక్రెయిన్ సంక్షోభాన్ని ప్రస్తావించలేదు. విదేశాలలో చదువుకునేందుకు ముఖ్యంగా వైద్య విద్య కోసం వెళుతున్న భారతీయ విద్యార్థుల కారణంగా వందల కోట్ల రూపాయలు కూడా దేశం నుంచి తరలిపోతున్నాయని ప్రధాని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News