- Advertisement -
గ్లాస్గో: ప్రపంచంలో కర్బనపు ఉద్గారాలను వెదజల్లుతున్న మూడో అతి పెద్ద దేశమైన భారత్, 2070 నాటికి ఉద్గారాలు వెదజల్లే విషయంలో నెట్-జీరో కార్బన్‌డైఆక్సయిడ్ సాధించగలదని ‘కాప్26 వాతావరణ సదస్సు’లో ప్రధాని మోడీ ప్రకటించి సదస్సుకు హాజరైన ప్రపంచ దేశాధినేతాలను ఆశ్చర్యచకితులను చేశాడు.గ్లోబల్ వార్మింగ్ ముప్పును ప్రపంచం నుంచి తప్పించాలని ఆయన అభిభాషించారు. ఉద్గారాలను వెదజల్లుతున్న దేశాల్లో అమెరికా, చైనా తర్వాత అతి పెద్ద దేశంగా భారత్ ఉంది. సదస్సులో మోడీ ప్రసంగానికి ముందు ప్రసంగించిన ఇంగ్లాండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ కాప్26 సదస్సును ఆరంభించారు. నేపాల్, థాయ్‌లాండ్‌లు కూడా కార్బన్ న్యూట్రాలిటీని 2045,2050 నాటికి సాధించాలని లక్షంగా పెట్టుకున్నాయి. కెనడా, ఆస్ట్రేలియాలు సైతం కొత్త షార్ట్-టర్మ్ లక్షాలను పెట్టుకున్నాయి.
- Advertisement -