Saturday, December 21, 2024

మూడోసారి దేశ ప్రధానిగా మోదీ ప్రమాణం

- Advertisement -
- Advertisement -

మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో మోడీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, పీయూష్‌ గోయల్‌, నిర్మలా సీతారామన్‌, ఎస్‌.జైశంకర్‌, ప్రహ్లాద్ జోషి, జుఅల్ ఓరమ్, గిరిరాజ్ సింగ్, అశ్విని వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా, భూపేంద్ర యాదవ్, గజేంద్ర సింగ్ శఖావత్, అన్నపూర్ణ దేవి, కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు తదితరులు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు.

కాగా, దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండో నేతగా మోదీ నిలిచారు. మోడీ ప్రమాణ స్వీకారానికి సుప్రీం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, కాంగ్రెస్ ఛీప్ మల్లికార్జున ఖర్గే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అధినేత ముకేష్ అంబానీ, రజినీ కాంత్, పలువురు ఎన్డీయే నేతలు, ఎంపీలు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్, సీషెల్స్, మాల్దీవ్స్ దేశాధినేతలను కూడా హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News