Monday, December 23, 2024

భూటాన్ రాజు జిగ్మేతో మోడీ చర్చలు

- Advertisement -
- Advertisement -

డోక్లామ్ విషయం అత్యంత కీలకం

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం భూటాన్ రాజు జిగ్మే ఖేసార్‌తో చర్చలు జరిపారు. పరస్పర జాతీయ ప్రయోజనాలు, కీలకమైన ద్వైపాక్షిక సంబంధాల పరిధిలోకి వచ్చే అంశాలపై వీరు దృష్టి సారించారని అధికారవర్గాలు ఆ తరువాత తెలిపాయి. కింగ్ జిగ్మేతో రెండు రోజుల పర్యటన సోమవారం ఆరంభం అయింది. భూటాన్ భౌగోళిక ఉనికి భారతదేశ భద్రతా కోణంలో అత్యంత కీలకమైనది. ఈ హిమాలయ దేశం భారత్ చైనాల సరిహద్దుల భద్రత విషయంలో ప్రధాన విషయం అవుతోంది. ఇరువురు నేతల చర్చల దశలో డోక్లామ్ విషయం ప్రస్తావనకు వచ్చిందా? లేదా అనేది స్పష్టం కాలేదు.

అయితే భద్రతా సహకారం విషయంలో ఇండియా , భూటాన్‌లు ఎప్పటికప్పుడు సంప్రదింపులు సాగిస్తూ సమన్వయంతో వ్యవహరిస్తున్నాయని భారతదేశ విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా తెలిపారు. కేవలం భద్రతా విషయాలలోనే కాకుండా విస్తృత రంగాలకు సంబంధించి ఇప్పుడు భూటాన్ రాజు ఇండియా పర్యటన సదవకాశంగా ఉంటుందని విలేకరులకు చెప్పారు. భారత్ చైనా భూటాన్ మధ్య డోక్లామ్ త్రి కూడలి విషయం ప్రధాన విషయంగా ఉంటూ వస్తోంది. డోక్లామ్ పీఠభూమి వద్ద తమ ప్రాంతానికి చెందిన స్థలంలో చైనా ఓ రాదారిని విస్తరించుకుంటోందని భూటాన్ నిరసన తెలిపింది. ఈ వ్యవహారం ఇప్పటికీ ప్రతిష్టంభనతో సాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News