Wednesday, January 22, 2025

రేపు ప్రధానితో లైఫ్ ఆరంభం

- Advertisement -
- Advertisement -

బిల్‌గేట్స్, మాల్పాస్ అనుసంధానం
పర్యావరణ హితంగా జీవన శైలి
ప్రపంచవ్యాప్త ఉద్యమానికి నాంది

Launch of ‘PM Cares for Children’ scheme
న్యూయార్క్/న్యూఢిల్లీ : ఆదివారం అత్యంత ఆసక్తికరమైన అంశంతో ప్రపంచ స్థాయి పర్యావరణ ఉద్యమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆరంభిస్తారు. వీడియోకాన్ఫరెన్స్ ప్రక్రియలో జరిగే ఈ లైఫ్‌స్టయిల్ ఫర్ ది ఎన్వరాన్‌మెంట్ (ఎల్‌ఐఎఫ్‌ఇ) మూవ్‌మెంట్‌ను ప్రధాని ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా జరిగే కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులు డేవిడ్ మాల్పాస్ ఇతర ప్రముఖులు, ఆర్థికవేత్తలు పాల్గొంటారు.ఈ ఉద్యమంలో తమవంతుగా పాల్గొనే అంశాన్ని తెలియచేస్తారని అధికారులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేకించి ఇప్పుడు కావల్సింది మన జీవనశైలిని సరైన రీతిలో అవవర్చుకుని, పర్యావరణ హితం అయ్యేందుకు వీలు కల్పించడం.

ఇది ఓ ప్రజా ఉద్యమ ప్రక్రియగా మారితేనే నిర్ణీత లక్షాలు నెరవేరేందుకు వీలేర్పడుతుంది. ఈ క్రమంలో ప్రధాని మోడీ చొరవ తీసుకుని ఈ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రపంచవ్యాప్త ప్రముఖులను ఇందులో భాగస్వామ్యం చేయాలని సంకల్పించారు. ఈ ప్రపంచ స్థాయి కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు ఆరంభిస్తారు. కార్యక్రమంలో పలువురు విద్యావేత్తలు, యూనివర్శిటీలు, పరిశోధనా సంస్థల అధ్యయనకర్తలు, డాక్టర్లు, పర్యావరణవేత్తలు పాల్గొంటారు. ఉద్యమాన్ని నిర్మాణాత్మకం చేసే దిశలో తమ సూచనలు సలహాలు వెలువరిస్తారు.

పర్యావరణ హిత జీనవవిధానానికి ప్రాధాన్యత ఇవ్వడం కీలక అంశంగా ప్రపంచ స్థాయి ఉద్యమ నిర్మాణం ఈ ఆదివారం నాటి ప్రారంభ కార్యక్రమం ఉద్ధేశం అని ఆధికారులు తెలిపారు. ఆరంభ కార్యక్రమంలో క్లైమెట్ ఎకనామిస్టు లార్డ్ నికోలస్ స్టెర్న్, ప్రొఫెసర్ కాస్ సన్‌స్టెయిన్ , యుఎన్‌డిపి గ్లోబల్ హెడ్ అచిమ్ స్టెయినర్ ఇతరులు పాల్గొంటారు. ప్రధాని మోడీ కీలకోపన్యాసం చేస్తారు. గత ఏడాది గ్లాస్గోలో జరిగిన ఐరాస ఆధ్వర్యపు వాతావరణ మార్పుల సదస్సులోనే ప్రధాని మోడీ ఈ లైఫ్ ప్రతిపాదన చేశారు. ఇప్పుడు ఇది కార్యరూపం దాల్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News