- Advertisement -
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం నుంచి తమ స్వరాష్ట్రం గుజరాత్‌లో మూడురోజుల పాటు పర్యటిస్తారు.ఈ సందర్భంగా ఆయన బహుళ స్థాయి ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తూ ప్రారంభిస్తారు. గాంధీనగర్, బనస్‌కాంత, జామ్‌నగర్, దాహోద్‌లలో జరిగే పలు కార్యక్రమాలలో వరుసగా పాల్గొంటారని ప్రధాన మంత్రి కార్యాలయం ఆదివారం తెలిపింది. సోమవారం గుజరాత్ చేరగానే ప్రధాని మోడీ విద్యా సమీక్షా కేంద్రను సందర్శిస్తారు. విద్యారంగ సంస్కరణలను సమీక్షిస్తారు. మంగళవారం తాను డబ్లుహెచ్‌ఒ సాంప్రదాయక వైద్యం కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రధాని స్వయంగా తెలిపారు. ప్రపంచస్థాయిలో ఆరోగ్యం దిశలో భారతీయ ప్రాచీన సంప్రదాయక వైద్య చిక్సి పటిష్టతకు ఈ కేంద్రం దోహదం చేస్తుంది. బుధవారం ఆయన గాంధీనగర్‌లో జరిగే ఆయుష్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సులో పాల్గొంటారు.
- Advertisement -