Thursday, January 23, 2025

హైదరాబాద్‌కు చేరుకున్న మోడీ

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన విశాఖపట్నంలో ముగిసింది. మోడీ విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో ప్రధాని మోడీకి బిజెపి నేతలు స్వాగతం పలికారు. బేగంపేటలో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 1500 మంది పోలీసులతో బేగంపేట్ పరిసరాల్లో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మరో 100 మంది కేంద్ర బలగాలతో నిఘా పెట్టారు. ఇవాళ మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు టాఫ్రిక్ ఆంక్షలు ఉంటాయి.  1:40 నుంచి 2 గంటల వరకు ఎయిర్‌పోర్ట్‌లో స్వాగత సభ ఏర్పాటు చేశారు. 2:15కి బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి రామగుండానికి ప్రధాని వెళ్లనున్నారు. 3:30 గంటలకు రామగుండం ఎరువుల కర్మాగారాన్ని మోడీ సందర్శించనున్నారు. రామగుండంలో 4:15 నుంచి 5:15 వరకు బహిరంగా సభ ఉంటుంది. రామగుండంలో ఎరువుల కార్మాగారాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. 5:30కి రామగుండం నుంచి ప్రధాని తిరుగు ప్రయాణం కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News