మనతెలంగాణ/హైదరాబాద్: రామానుజాచార్య ఆలోచనలు, ప్రబోధనలు ఇప్పటికీ ప్రేరణ కలిగిస్తాయని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. శనివారం ముచ్చింతల్‌లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తన ట్విట్టర్‌లో వెల్లడించారు. 11వ శతాబ్ధానికి చెందిన భగవద్రామానుజులు గొప్ప భక్తి ఉద్యమాన్ని సాగించారు. 216 అడుగుల ఎత్తు ఉన్న స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రామానుజాచార్య విగ్రహాం ఏర్పాటు చేయడం అభినందనీయం. సర్వమత సమానత్వం కోసం రామానుజులు ప్రబోధనలు చేశారు. రామానుజాచార్య ఆశ్రమానికి చెందిన చిన్నజీయర్ స్వామి ఈ విగ్రహాన్ని పంచలోహాలతో ఏర్పాటు చేశారు. ప్రధాని కార్యక్రమ సమయంలో రామానుజాచార్య జీవిత విశేషాలను త్రీడీ రూపంలో ప్రజెంట్ చేశారు. జాతి, కుల, మత విబేధాలు లేకుండా అందరి సమానత్వం కోసం రామానుజాచార్య అవిశ్రాంతంగా పనిచేశారు. అంతకుముందు ఇక్రిశాట్‌లో జరిగిన 50వ వార్సికోత్సవ వేడుకల్లోనూ ప్రధాని పాల్గొన్నారు.