Monday, December 23, 2024

370 సీట్ల టార్గెట్ సాధించాలి!

- Advertisement -
- Advertisement -

బిజెపి కార్యకర్తలకు ప్రధాని మోడీ ఆదేశం

న్యూఢిల్లీ: తమతమ నియోజకవర్గాల్లో ‘గత రికార్డులను కూడా ఛేదించండి’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి కార్యకర్తలను కోరారు. ‘ బిజెపి పార్టీకి 370 సీట్లు, బిజెపి నేతృత్వంలోని ఎన్డిఏ కూటమికి 400కు పైగా సీట్లను సాధించిపెట్టండి’ అని కూడా ఆయన అన్నారు. ప్రజలు ‘మరోసారి మోడీ ప్రభుత్వం’ అంటున్నారని కూడా ఆయన తెలిపారు.

ఉత్తరప్రదేశ్ లోని 10 లోక్ సభ నియోజక వర్గాల్లోని బిజెపి బూత్ కన్వీనర్లతో ‘నమో యాప్’ ద్వారా ప్రధాని మోడీ మాటామంతీ చేశారు. అట్టడుగు స్థాయిలో కూడా ప్రచారం ముఖ్యమని సూచించారు. అంతేకాక యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న ‘మహిళా సురక్ష’ పథకాన్ని కూడ ప్రధాని మోడీ ప్రశంసించారు.

అసాధ్యాలను సుసాధ్యం ఎలా చేశామో… అంటూ మోడీ వివరాలను వెల్లడించారు. ముఖ్యంగా రామ మందిర నిర్మాణం, ఆర్టికల్ 370 తొలగింపు, ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్ అందించడం, ట్రిపుల్ తలాక్ వ్యతిరేకంగా చట్టం తీసుకు రావడం తదితరాలను ఆయన ప్రస్తావించారు. ట్రిపుల్ తలాక్ విషయం గురించి చెబుతూ తమ కూతుళ్లు, సోదరీమణులను కాపాడినందుకు కేవలం ముస్లిం మహిళలే కాదు, ముస్లిం కుటుంబాలకు చెందిన పురుషులు కూడా ధన్యవాదలు తెలిపారన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News