Sunday, December 22, 2024

ఓటు హక్కు వినియోగించుకోవాలి: మోడీ

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: మూడో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని నిషాన్ హైస్కూల్‌లో ప్రధాని మోడీ ఓటు వేశారు. మోడీతో పాటు పోలింగ్ కేంద్రం వద్దకు అమిత్ షా వచ్చారు. ఈ సందర్భంగా మోడీ మీడియాతో మాట్లాడారు. ఎండల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని ప్రధాని మోడీ ప్రశంసించారు. ఎన్నికల వేళ ప్రజలు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, వీలైనంత ఎక్కువ నీళ్లు తాగితే ఆరోగ్యం బాగుంటుందని, సమయంతో పోటీపడుతూ మీడియా మిత్రులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ఓటుకు విశేష ప్రాధాన్యం ఉందని, దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News