Thursday, January 23, 2025

ఉచితాలు వద్దని రూ.10 లక్షల కోట్ల మాఫీ చేసిన మోడీ: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Modi waived Rs 10 lakh crore

సిద్దిపేట: పాలమాకులలో ఇప్పటికే 55 ఇళ్లు ప్రారంభం చేసుకున్నాం. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. అర్హులైన మరింత మంది పేదలకు 30 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయిస్తామని వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో నిర్మించిన 23 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గృహా ప్రవేశాలు శనివారం ఉదయం సరిగ్గా 11 గంటలకు ఘనంగా జరిగాయి. సంప్రదాయం ప్రకారం ప్రతి ఇంటికి మామిడి తోరణాలు కట్టి, ఇంట్లో  వైదిక పూజా కార్యక్రమాలు చేపట్టి పండుగ వాతావరణంలో లబ్ధిదారులు గృహా ప్రవేశాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ హరీశ్ రావు ముఖ్య అతిథిలుగా హాజరై ఇంటింటా గృహా ప్రవేశాలు జరిపి లబ్ధిదారులకు మిఠాయిలు తినిపించారు. కొత్త ఇళ్లు మంచిగుందా అమ్మా అంటూ లబ్ధిదారులతో మంత్రి ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. త్వరలోనే మీ ఇంటి అడుగుజాగలో ఇళ్లు కట్టుకునే వారికి వెసులుబాటు కల్పిస్తూ రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. రూపాయి ఖర్చు లేకుండా పైరవీ లేకుండా ప్రతి పేదోడికి ఇళ్లు అందించడమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేదలకు రెండు పడకల ఇళ్లు తెలంగాణ రాష్ట్రంలో అందిస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇళ్లు నిర్మాణం కోసం ఇచ్చే పైసలు బేస్మెంట్ కూడా సరిపోయేవి కావాని, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైసా ఖర్చు లేకుండా ఇళ్లు కట్టించి తాళం చేతిలో పెట్టి లబ్ధిదారులకు అప్పగిస్తున్నామని ప్రశంసించారు.

మండుటెండలో మీ గ్రామ ఊర చెరువు మత్తడి దూకిందని, తెలంగాణలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతోనేనని మంత్రి తెలిపారు. బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ఉందా? అని ప్రశ్నించారు. అంటూ ప్రతి పక్ష నేతల మాట తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం ఉచితాలు వద్దని చెప్పడంతో పాటు 10 లక్షల కోట్లు బడా పారిశ్రామిక వేత్తలకు మాఫీ చేసిందని దుయ్యబట్టారు. కానీ తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ ప్రభుత్వం పేద ప్రజానీకానికి అనేక సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ ఉచితాలు వద్దని మోడీ ప్రభుత్వం ఎద్దేవా చేయడం సరికాదని హరీష్ రావు ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దొంగ రాత్రి కరెంటు వచ్చేదని, రైతులు ఎంత తిప్పలు పడ్డారో మర్చి పోలేమని గుర్తు చేశారు. త్వరలోనే అర్హులైన అందరికీ కొత్త పెన్షన్లు అందిస్తామని, సిఎం కెసిఆర్ వచ్చాక ఆసరా పెన్షన్లు, నిరంతర ఉచిత కరెంటు, ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం చేసుకుంటున్నామన్నారు. ఏ పైరవీ చేయకుండానే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మితోనే ఆడపిల్ల పెళ్లి చేసుకుంటున్నామని కొనియాడారు.

కానీ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఉచితాలు వద్దని, కల్యాణ లక్ష్మీ, రైతుబంధు, రైతుభీమా, ఆసరా పెన్షన్ వద్దని స్వయంగా దేశ ప్రధాని చెబుతుంటే ప్రజలేమనాలనీ నిలదీశారు. రైతులకు 24 గంటల ఉచిత రావాల్సిన కరెంటు కేంద్రం కట్ చేసిందని, బాయికాడ మీటర్లు పెడితే 6500 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం ఇస్తామని ఆశ చూపిందని, బాయికాడ మీటర్లు పెట్టలేదనీ రూ. 6500 కోట్లు ఇవాళ రాష్ట్రానికి రావాల్సిన డబ్బును ఇయ్యలేదని మంత్రి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆదాయాన్ని సిఎం కెసిఆర్ పెంచారని, ప్రజల సొమ్మును ధనవంతులకు పంచింది బిజెపి అంటూ మండిపడ్డారు. తెలంగాణ సంపద పెంచి పేదలకు పంచితే.. పెరిగిన సంపద బడా కార్పొరేటర్లకు బిజెపి పంచిందని మంత్రి హరీశ్ విమర్శించారు.

తెలంగాణలో కోతలు లేకుండా నాణ్యమైన కరెంటు రైతులకు అందిస్తుంటే కళ్లు మండి కరెంటు తెలంగాణ ప్రజలకు రాకుండా బిజెపి అడ్డుపడుతున్నదని మంత్రి మండిపడ్డారు. బిజెపి అధికారంలోకి వచ్చాక ఏ వర్గం బాగుపడ్డదో, ఏవరికి లాభం జరిగిందో చెప్పాలనీ నిలదీశారు. తెలంగాణలో అన్ని వర్గాలకు మంచి చేయడమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి వర్గాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రం లో జరగని అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ తెలంగాణలో జరుగుతున్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News